- స్కిల్ కాలేజీలు ప్రారంభం
- 25 కాలేజీల్లో శిక్షణ తీసుకుంటున్న 1,118 మంది
- కోర్సు పూర్తికాగానే ఉపాధి లభించేలా కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం
రాష్ట్రంలోని స్కిల్ కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా స్థానిక కంపెనీల్లో ఉపాధి అవకాశాలను కల్పించ డమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంట్ పరిధితో పాటు పులివెందులలో కలిపి మొత్తం 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు 25 అందుబాటు లోకొచ్చినట్టు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వెల్లడించారు. మొత్తం 25 కాలేజీల్లో 56 కోర్సుల్లో 1,118 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. తొలి దశలో విశాఖ సెమ్స్, గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం, టీటీడీసీ శ్రీకాకుళం, టీటీడీసీ విజయనగరం, ఒం గోలు బొల్లినేని మెడిస్కిల్స్ విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. స్థానిక కంపెనీలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఒక్కో కాలేజీకి ఒక్కో కోర్సును డిజైన్ చేసినట్టు అధికారులు వెల్లడిం చారు. మొత్తం 13 రంగాలకు సంబంధించి 56 కోర్సులను డిజైన్ చేశారు. శిక్షణ పూర్తికాగానే ఉపాధి కల్పించేలా ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే 180 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకుంటే.. వారిలో 116 మందికి ఉపాధి లభించిందని, మిగ తావారివి ఎంపిక దశలో ఉన్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన విద్యార్థు లకు పూర్తి ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. కోర్సును బట్టి విద్యా ర్థిపై సగటున కనిష్టంగా రూ.20,000 నుంచి గరిష్టంగా రూ.55,000 వరకు ప్రభుత్వం వ్యయం చేస్తోంది.
No comments:
Post a Comment