PF EDLI : మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే మీకు రూ.7 లక్షల బీమా ఉంటుంది...
ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికి పీఎఫ్ ఉంటుంది. అయితే పీఎఫ్‍లో మూడు పథకాలు ఉంటాయని చాలా మందికి తెలియుదు. పీఎఫ్ లో చేరిన వారికి EPF పథకం, 1952; పెన్షన్ స్కీమ్, 1995 (EPS), ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకాలు వర్తిస్తాయి.
ఉద్యోగుల డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం అకాల మరణానికి గురైనప్పుడు నామినీకి రూ.7 లక్షల బీమా పరిహారం వస్తుంది.
EPS, EPF స్కీమ్‌ల విషయంలో, ఉద్యోగులు కంట్రిబ్యూషన్‌లు చేయాల్సి ఉండగా, EDLI స్కీమ్ కోసం, ఉద్యోగి ఎలాంటి కాంట్రిబ్యూషన్‌లు చేయాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి యజమాని మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏ ఉద్యోగైనా దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు బీమా రక్షణగా EPFO అందించే ప్రయోజనాల్లో ఇది ఒకటని ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డైరెక్టర్, ఆనంద్ రాఠీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అమ్జద్ ఖాన్ చెప్పారు.
దీన్ని 1976లో ప్రారంభించారని పేర్కొన్నారు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1952 కింద కవర్ చేయబడిన అన్ని సంస్థలు డిఫాల్ట్‌గా EDLI ప్రయోజనాల కోసం నమోదు చేసుకుంటారని చెప్పారు. అయితే, మీరు అధిక చెల్లింపు జీవిత బీమా పథకాన్ని తీసుకోవాలనుకుంటే మీరు పథకం నుంచి వైదొలగవచ్చని వివరించారు. EDLI పథకం కింద, కంట్రిబ్యూషన్ యజమాని బేసిక్ + DAలో 0.5% మాత్రమే చెల్లించాలి. గరిష్టంగా రూ. 75కి పరిమితం ఉంటుంది.
మీరు నిరంతరం ఒక సంవత్సరం పాటు పనిచేసినట్లయితే మాత్రమే ఈ పథకం ప్రారంభమవుతుంది. మరణించినప్పుడు సదరు వ్యక్తి EPFలో యాక్టివ్ మెంబర్‌గా ఉండాలి. బీమా మొత్తాన్ని ఒక ఉద్యోగి తన ఉద్యోగంలో చేరిన చివరి 12 నెలల్లో సగటు నెలవారీ ఆదాయం కంటే 35 రెట్లు తీసుకోవడం ద్వారా గణన చేస్తారు. పీఎఫ్ ఖాతాదారుడు అకాల మరణం విషయంలో, నామినీలు తప్పనిసరిగా PF, పెన్షన్ ఉపసంహరణ, EDLI క్లెయిమ్‌లను క్లెయిమ్ ఫారమ్ ద్వారా క్లెయిమ్ చేయాలి. నామినీ తప్పనిసరిగా ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం లేదా వారసత్వ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. అప్పుడే రూ.7 లక్షలు వస్తాయి.
No comments:
Post a Comment