- AP : ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం
- కసరత్తు చేస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కర్ణాటకలో అమలవుతున్న చట్టం తరహాలో దీనిని తీసుకురానున్నారు.
ఈ మేరకు ఉపా ధ్యాయ సంఘాల నుంచి సూచనలు, సలహాలను ప్రభుత్వం ఆహ్వానించింది.
వాటిని ఈ నెల 28లోపు పాఠశాల విద్యాశాఖ జేడీకి పంపించాలని సూచించింది.
ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉంటుంది.
ఆ బదిలీలను కచ్చితంగా వేసవి సెలవు ల్లోనే నిర్వహించాలి. ఒక ఉపాధ్యాయుడు కేటగిరీ-1లో ఒక్కసారి మాత్రమే పని చేయాలనే నిబంధననూ తీసు కురానున్నారు.
దీని ప్రకారం ప్రతి ఉపాధ్యాయుడు అన్ని కేటగిరిల్లోనూ పని చేయాల్సి ఉంటుంది. పట్టణం నుంచి మారుమూల పల్లెలోని బడికి వరకు బదిలీల్లో వెళ్లాల్సి వస్తుంది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావి స్తోంది.
పైరవీ, సిఫార్సు బదిలీలకు ఆస్కారం లేకుండా అన్నీ కౌన్సెలింగ్ బదిలీలే జరిగేలా చట్టంలో నిబంధన పెట్టాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కీలక మంత్రి, ఆయన పీఏ, కొందరు అధికారులు కలిసి భారీగా పైరవీ బదిలీలు నిర్వహించారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, డబ్బులు ఉన్నవారు బదిలీలు చేయించుకోగలిగారు.
ఇలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు.
No comments:
Post a Comment