10వ తరగతి పూర్తి అయ్యాక IIIT లో ప్రవేశం కొరకు
1) మన ఆంధ్రప్రదేద్ లో నాలుగు ఐఐఐటీ లు ఉన్నాయి (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం) ఈ నాలుగు సెంట్రల్ లో కలిపి 4000 సీట్స్ ఉంటాయి. ఒక వారం లో నోటిఫికేషన్ రావచ్చు, వీటిల్లో మీ 10వ తరగతి లో వచ్చిన గ్రేడ్స్ ఆధారం గా ప్రవేశం కల్పిస్తారు.
2) 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చవుంటే మీకు వచ్చిన గ్రేడ్ పాయింట్స్ కి 0.4 పాయిట్స్ కలుపుతారు. అంటే 10th లో మీకు 9.8వస్తే 9.8+0.4=10.2 వచ్చినట్టు. ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన వాళ్లకి 0.4 పాయింట్స్ కలపరు.
3) ఒకే గ్రేడ్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒకే సీట్ కి పోటీ పడినప్పుడు వాళ్ళ సైన్స్ మరియు మాథ్స్ గ్రేడ్ పాయింట్ చూస్తారు అది కూడా ఒకే లా ఉంటే వయసు ని పరిధిలోకి తీసుకుని ఎక్కువ వయసు ఉన్నవాళ్ళకి ఆ సీట్ కేటాయిస్తారు.
4) స్పోర్ట్స్ కోట లో మరియు N.C.C కోట లో 1% సీట్స్ కేటాయిస్తారు మీకు 10th లో పై రెండు సరిఫికెట్లు ఉంటే ఆ కోట లో కూడా అప్లై చేసుకోవచ్చు.
5) అప్లికేషన్ విడుదల అయ్యాక ఒక నెల టైం ఇస్తారు అప్లికేషన్ తేదీ ముగిశాక అప్లై చేసుకున్న వాళ్ళ గ్రేడ్ ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి 1st లిస్ట్ ని రిలీజ్ చేసి వాళ్ళకి కౌన్సెలింగ్ కి పిలుస్తారు. 1st లిస్ట్ లో మిగిలిన సీట్స్ ని బట్టి సెకండ్ లిస్ట్ విడుదల చేస్తారు.
6) అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్ కి ఒక లాప్టాప్, 2 జతల యూనిఫామ్, స్పోర్ట్స్ షూ, ఫార్మల్ షూ, బ్లాంకెట్స్ ఇస్తారు.
7) ఫీజు 36000/- ( ట్యూషన్ ఫీ 6000/- మరియు హాస్టల్ ఫీ 30,000 ఉంటుంది) ఫీజు రిఎంబెర్స్మెంట్, స్కాలర్ షిప్ సౌకర్యం ఉన్నవి. సంవత్సర ఆదాయం, తెల్ల రేషన్ కార్డ్, 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి వర్తిస్తాయి.
8) ఎందుకైనా మంచిది మన వాళ్ళు మోడీ ప్రవేశపెట్టిన 10% అగ్రవర్ణ రిజర్వేషన్లు కి సంబంధించి EWS( Economical Weaker Section) certificate మీ సేవలో ఇస్తున్నారని తెలిసింది లేట్ చెయ్యకుండా దానికోసం అందరూ అప్లై చేసుకోండి.
పూర్తి వివరాలు కోసం ఐఐఐటీ website www.rguktn.ac.in (Nuzvid IIIT Site) లేదా www.rgukt.in లను చూడండి.
ఐఐఐటీ ప్రవేశ అర్హతలు
2019 ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
రిజర్వేషన్లు
ట్రిపుల్ ఐటీలో మొత్తం వెయ్యి సీట్లకు గానూ 85 శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మెరిట్ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు.
రిజర్వేషన్ల ప్రకారం పరిశీలిస్తే
ఎస్సీకి 15, ఎస్టీకి 7, బీసీ-ఏ- 7, బీసీ-బీ- 10, బీసీ-సీ 1, బీసీ-డీ 7, బీసీ-ఈ 4, దివ్యాంగులకు 3, క్రాప్ 2, ఎన్‌సీసీ 1, స్పోర్ట్స్ 0.5 శాతాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. దీంతోపాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 50 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 20 సీట్లలో విద్యార్థులను భర్తీ చేయనున్నారు. అన్ని విభాగాల్లో బాలికలకు 33.3 శాతం ప్రవేశాల్లో రిజర్వేషన్‌ను పాటిస్తారు.
ప్రవేశ విధానం
పదో తరగతిలో జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. ప్రభుత్వం నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర జిల్లా పరిషత్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెనుకబాటు సూచి కింద 0.4 పాయింట్లను వచ్చిన పదోతరగతి గ్రేడ్‌కు జత కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. సీట్ల కేటా యింపు సమయంలో సమాన గ్రేడ్ పాయింట్లు ఉన్నట్టయితే మొ దట గణితం తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లీష్, తర్వాత సోషల్, ఆ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్‌లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అయినా సమానమైతే పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్న వారికి అవకాశం ఇస్తారు.
* ఫీజులు ఇలా..*
*ప్రవేశం పొందిన విద్యార్థులు ఐఐఐటీలో ఆరు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదటి రెండేళ్ల వార్షిక రుసుంగా రూ. 36వేలు ఆ తర్వాత మిగిలిన నాలుగు సంవత్సరాలకుగానూ వార్షిక రుసుం రూ. 40 వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ఉచిత సౌకర్యాలు
పేద విద్యార్థులు ఎవరైతే ఫీజు రీయంబర్స్ మెంట్ పథకానికి అర్హులో వారికి విద్య, హాస్టల్‌తో పాటు అన్ని సౌకర్యాలు ఉచితంగా ప్రభుత్వమే కల్పిస్తుంది.
కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన పత్రాలు
దరఖాస్తు చేసుకున్న సమయంలో ఏవైతే సమర్పించారో కౌన్సిలింగ్‌లో అవి సమర్పించాల్సి ఉంటుంది.కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, కాండక్ట్, టీసీ, మెమోతో పాటు రిజర్వేషన్ వర్తించే పత్రాలేమైనా ఉంటే అన్నింటినీ సమర్పించాలి.
దరఖాస్తు చేసుకోవాలిలా.
అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మీ సేవా, టీఎస్ ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 150 చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 200 ప్రవేశరుసుం చెల్లించాల్సి ఉంటుం ది. ఈ మొత్తాన్ని ఆన్‌లైన్ సెంటర్‌లోనే చెల్లించాలి. సెంటర్‌చార్జి అదనంగా రూ. 25 వసూలు చేస్తారు.
Websites
www.rgukt.in