🔺కేంద్ర బడ్జెట్ 2019-20 - నిరాశపరిచిన విద్యారంగ కేటాయింపులు🔺
ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో విద్యారంగ కేటాయింపులు విద్యారంగ అభిమానులను నిరాశ పరిచాయి.
➧ మొత్తం బడ్జెట్లో విద్యారంగ కేటాయింపులు 3.4 % శాతానికి మాత్రమే పరిమితం అయ్యాయి.
➧ మొత్తం ₹ 27 లక్షల 86 వేల 349 కోట్ల కేంద్ర బడ్జెట్లో విద్యారంగ వాటా ₹ 94,854 కోట్లు(గత బడ్జెట్ లో ₹ 83,626 కోట్లు).
➧దీనిలో ప్రాథమిక విద్యా రంగ వాటా ₹ 56,537 కోట్లు(₹ 50,114 కోట్లు) కాగా, ఉన్నత విద్యారంగం వాటా ₹ 38 వేల 317 కోట్లు(₹ 33,512 కోట్లు).
➧విద్యారంగానికి గత బడ్జెట్లో కేటాయింపులు ₹ 83,626 కోట్లతో పోలిస్తే ప్రస్తుత కేటాయింపులు పెరిగినట్లుగా కనపడినప్పటికీ, మొత్తం బడ్జెట్ లో విద్యా రంగం వాటా 3.4 % కి మాత్రమే పరిమితం అయింది.
ప్రాథమిక విద్యా రంగానికి సంబంధించి జాతీయ విద్యా మిషన్ కు ₹ 36 వేల 447 కోట్లు( గత బడ్జెట్ లో 30,833 కోట్లు) కేటాయించగా, NMMS కు 368 కోట్లు(299 కోట్లు), బాలికా విద్య ప్రోత్సాహకాలకు 100 కోట్లు(255 కోట్లు), కేంద్రీయ విద్యాలయాలకు 5012 కోట్లు(5006 కోట్లు), నవోదయ విద్యాలయాలకు 3068 కోట్లు(3213 కోట్లు), NCERT కి 277 కోట్లు(284 కోట్లు), బాల భవన్ లకు 21 కోట్లు, మధ్యాహ్న భోజనానికి 11 వేల కోట్లు(10,500 కోట్లు) కేటాయింపు జరిపారు.
ఈ అరకొర కేటాయింపులతో అందరికీ నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

No comments:
Post a Comment