Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఉపాధ్యాయ శిక్షణ కట్టుదిట్టం - శిక్షణార్థులకు బయోమెట్రిక్‌ హాజరు

ఉపాధ్యాయ శిక్షణ కట్టుదిట్టం!
శిక్షణార్థులకు బయోమెట్రిక్‌ హాజరు

నెల రోజుల్లో అమలుకు ఆదేశం

పరిశీలనకు రానున్న ఎన్‌సీటీఈ బృందాలు

బెంబేలెత్తుతున్న కళాశాల యాజమాన్యాలు

ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన శిక్షణ కళాశాలల్లో ఇక బోగస్‌ హాజరుకు తావు లేకుండా జాతీయ ఉపాధ్యాయ శిక్షణ మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలు కఠినతరం చేసింది. ప్రతి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని ఆదేశించింది.

ఈ పరిణామం డీఈడీ, బీఈడీ, ఎంఈడీ శిక్షణ కళాశాలలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రేతర ప్రాంతాలైన ఒడిశా, జార్ఖండ్‌, బిహార్‌, పశ్చిమబంగా విద్యార్థులకు ఎక్కువగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. వారు తరగతులకు హాజరైనా కాకున్నా పరీక్షలకు అనుమతించటం ఏటా జరిగే తంతే. దీంతో ఉపాధ్యాయ శిక్షణ నానాటికీ తీసికట్టుగా మారుతోందనే అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ కళాశాలలను గాడిలో పెట్టడానికి, ఉపాధ్యాయ శిక్షణను మరింత కట్టుదిట్టం చేయటానికి తాజాగా ఎన్‌సీటీఈ ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


అత్యధిక కళాశాలలు గుంటూరులోనే.

రాష్ట్రంలోనే అత్యధికంగా 120 బీఈడీ, 60 డీఈడీ కళాశాలలు గుంటూరులో ఉండగా, కృష్ణా జిల్లాలో 28 బీఈడీ, 20 డీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాల పరిధిలో ఏటా బీఈడీ, డీఈడీ శిక్షణకు 40వేల మంది ప్రవేశాలు పొందుతున్నారు. వీరిలో 50 శాతానికి పైగా రాష్ట్రేతర విద్యార్థులే ఉంటున్నారు.

ఒడిశా, జార్ఖండ్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు తక్కువగా ఉండటం, ఆపై ఆ రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉండటంతో తరచుగా డీఎస్సీ పోస్టుల భర్తీకి ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.*

దేశంలో ఎన్‌సీటీఈ గుర్తింపు పొందిన ఏ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో అయినా శిక్షణ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలపై విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణ తక్కువగా ఉంది. దీంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ శిక్షణార్థులకు హాజరు వేసే దగ్గరి నుంచి పరీక్షలు రాసే వరకు చూచిరాతలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చి మరీ ప్రవేశాలు చేసుకుంటున్నారనే అపవాదును ఆయా కళాశాలలు మూటగట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా ఏఎన్‌యూ పరిధిలో ఉపాధ్యాయ విద్య మరింత తీసికట్టుగా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీ పరిధిలో అనేక కళాశాలలు సరైన మౌలిక వసతులు కలిగిలేవు. ఇళ్లల్లోనే కళాశాలలు ఉంటున్నాయి. ఆపై అర్హతలు కలిగిన అధ్యాపకులను నియామకం చేసుకోవటం లేదు. ఈ లోపభూయిష్టమైన విధానాలను అరికట్టడానికి తొలుత కళాశాలల్లో బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయటం అత్యవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకుందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.


ఇక పక్కాగా విద్యా బోధన.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం మూడు పూటలా శిక్షణ పొందే శిక్షణార్థులతో పాటు బోధన చేసే అధ్యాపకుల వరకు ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్‌ హాజరు వేసుకోవాల్సిందే. దీని ద్వారా బోధన మెరుగుపడటం, తరగతులు పక్కాగా జరగటానికి దోహదపడుతుంది.

బయోమెట్రిక్‌ హాజరు కోసం ప్రతి ఒక్క విద్యార్థి, అధ్యాపకుడు కళాశాల గుమ్మం తొక్కాల్సిందే. దీంతో విద్యార్థులకు హాజరు మెరుగుపడుతుంది. నిత్యం తరగతులకు హాజరుకావటం వల్ల విద్యా బోధన మెరుగుపడుతుంది. భవిష్యత్తులో అర్హులైనవారు  ఉపాధ్యాయ వృత్తిలోకి రావటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదివరకు బయోమెట్రిక్‌ హాజరు లేకపోవటంతో ఆసక్తి ఉన్నా లేకపోయినా ఎయిడెడ్‌ ఉపాధ్యాయ కొలువులపై ఆశతో బీఈడీ, డీఈడీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో చేరేవారు. ప్రస్తుతం బయోమెట్రిక్‌ విధానం అమలు చేయటం వల్ల నిరంతరం తరగతులకు హాజరుకావల్సి ఉంటుంది. వృత్యంతర శిక్షణ కోసం సమీపంలోని పాఠశాలలకు వెళ్లాలి. ఆపై ప్రాజెక్టు రికార్డులు పక్కాగా రాయాలి. ఇంతకుముందు ఇవేం చేయకపోయినా యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బోగస్‌ హాజరు వేసి చూచిరాతలకు అవకాశం కల్పించినందుకు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడేవి. బయోమెట్రిక్‌ హాజరుతో అక్రమ మార్గాలు మూసుకుపోతాయి. దీంతో పక్కాగా విద్యా బోధన చేయటం అంటే తమకు చాలా ఆర్థిక భారంతో కూడిన వ్యవహారమని అప్పుడే కొన్ని కళాశాలలు ఆందోళన చెందుతున్నాయి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND