Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

విందాం - నేర్చుకుందాం --నేటి రేడియో పాఠం--తేది : 03.09.2019 విషయము : పరిసరాల విజ్ఞానం

విందాం - నేర్చుకుందాం
నేటి రేడియో పాఠం

★ తేది : 03.09.2019
★ విషయము : పరిసరాల విజ్ఞానం
★ పాఠం పేరు : "మనం చెట్లను పెంచుదాం"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
〰〰〰〰〰〰〰〰
మనం చెట్లను పెంచుదాం
〰〰〰〰〰〰〰〰
బోధనా లక్ష్యాలు:
*విద్యార్థినీ విద్యార్థులు :
భూమి మీద విస్తీర్ణంలో అడవులు 33% ఉండాలనే విషయం తెలుసుకుంటారు.
• అడవుల విస్తీర్ణం తగ్గడం వలన కలిగే నష్టాల గురించి తెలుసుకుంటారు.
• అడవుల వలన కలిగే లాభాల గురించి తెలుసుకుంటారు.
• అందరూ మొక్కలను, చెట్లను పెంచాలి అనే విషయాన్ని తెలుసుకుంటారు.
• పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కల గురించి తెలుసుకుంటారు.
• మొక్కలు ఎలా నాటాలో తెలుసుకుంటారు.
• పర్యావరణ పరిరక్షణ కొరకు స్వచ్ఛంద సంస్థలు చేసే సహాయం గురించి తెలుసుకుంటారు.
 *బోధనాభ్యసన సామగ్రి:*
• గన్నేరు. మల్లె, నిమ్మ, మామిడి, గులాబి, దామంత, జమ, సపోటా అని రాసి ఉన్న చీటీలు, డబ్బా, బంతి, నల్లబల్ల, సుద్దముక్క (చాక్ పీస్), పాఠ్యపుస్తకం.

ప్రపార పూర్వ కృత్యాలు:
 కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలి.*
*కృత్యం:*
తరగతిలోని విద్యార్థులందరిని నల్లబల్లకెదురుగా కూర్చోబెట్టాలి.
• రేడియో టీచర్ ప్రశ్న అడగ్గానే ఒక విద్యార్థి నిలబడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి.
• విద్యార్థి సమాధానం చెప్పిన తర్వాత రాజు, లతలు కూడా రేడియోలో సమాధానం చెపుతారు.
• సమాధానాలు బాగా చెప్పిన విద్యార్థులను అభినందించాలి,
*ఆట*
 *ఈ కార్యక్రమంలో నిర్వహించబోయే ఆటను ఆడించే విధానాన్నీ తెలుసుకొని ఉండాలి*
• తరగతిలోని విద్యార్థులందరినీ నల్లబల్లకెదురుగా వలయాకారంలో కూర్చోబెట్టాలి.
• నల్లబల్లను రెండుగా విభజించి మొదటి సగభాగంలో పూలమొక్కలు అని రెండవ సగభాగంలో పండ్ల మొక్కలు అని రాయాలి.
• గన్నేరు, ముల్లె, నిమ్మ, మామిడి, గులాబి, చామంతి, జామ, సపోటా అని రాసిన చీటీలను డబ్బాలో ఉంచాలి.
• వలయాకారంలో కూర్చున్న విద్యార్థులందరి మధ్యలో చీటీలున్న డబ్బాను ఉంచాలి.
• రేడియోలో మ్యూజిక్ వస్తున్నంత సేపు విద్యార్థులందరు బంతిని ఒకరినుండి మరొకరికి విసురుతూ ఉండాలి.
• రేడియోలో మ్యూజిక్ ఆగిపోగానే బంతి ఏ విద్యార్థి దగ్గర ఉంటే ఆ విద్యార్థి డబ్బాలోని చీటిని తీసి చదవి అది ఏరకం మొక్కైతే నల్లబల్లపై దానికింద రాయాలి.
డబ్పాలోని చీటీలన్ని తీసి చదివి నల్లబల్ల పై రాసే వరకు ఈ ఆట ఆడాలి.
• నల్లబల్లపై సరిగా రాసిన విద్యార్థులను అభినందించాలి.

కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.*
పాట
పల్లవి :
 ప్రగతికి బాటలు వేయాలంటే
పచ్చని చెట్లను పెంచాలి
వానలు బాగా కురవాలంటే
వన సంరక్షణ చేయాలి  // ప్రగతికి//

చరణం 1:
కమ్మని పండ్లు పొందాలంటే
పండ్ల తోటను పెంచాలి
చక్కని పూలు కావాలంటే
పూల వనాలు పెంచాలి   // ప్రగతికి//

చరణం 2:
మానవ మనుగడ సాగాలంటే
పర్యావరణం రక్షించాల
ప్రకృతిని రక్షించాలంటే
అందరూ చెట్లను పెంచాలి   //ప్రగతికి//

పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND