3 నుంచి పాఠశాలల్లో పోషకాహార మాసోత్సవాలు.
విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘రాష్ర్టీయ పోషణ్ మాస్’ కార్యక్రమాన్ని ఈనెల 3 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా చూడాలని సూచించింది. సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
3 నుంచి 8వ తేదీ వరకు మొదటి వారం రోజుల్లో వైద్య ఆరోగ్యశాఖ సహకారం తీసుకుని రక్తహీనతగల విద్యార్థులను గుర్తించడం, బాలబాలికల బరువు, ఎత్తులు బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
కార్యక్రమాలను టీచర్లు, విద్యార్థుల బృందం నిర్వహిస్తుంది.
9 నుంచి 15వ తేదీ వరకు రెండో వారం పోషకవారంగా నిర్వహణ. కార్బొహైడ్రేట్స్ ప్రాధాన్యత, ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్, మినరల్ ప్రాధాన్యతలను విద్యార్థులకు వివరించడంతోపాటు ఐరన్ పోలిక్ సప్లిమెంట్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతారు. కిచెన్ గార్డెన్లపై ప్రత్యేక దృష్టి పెడతారు. ఇందులో స్కూల్ ఏఎన్‌ఎం, పీఈటీ, సైన్సు టీచర్ల బృందం పాల్గొంటొంది.
16 నుంచి 22వ తేదీ వరకు మూడోవారం విద్యార్థులకు వ్యాసరచన, పోషకాహారంపై చర్చా కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పెయింటింగ్, ఎగ్జిబిషన్ పోటీలను ఉపాధ్యాయులు, విద్యార్థుల బృందం నిర్వహిస్తుంది.
23 నుంచి 29వ తేదీ వరకు 4వ వారం కార్యక్రమాలుగా పోషకాహారంపై చర్చ నిర్వహిస్తారు. 8, 9 తరగతుల విద్యార్థులకు ఎనీమియా, హ్యాండ్‌వాష్, పోషక విలువల ఆహారం, డయేరియా, విటమిన్లు, మినరల్స్ గురించి తెలియజేస్తారు.

No comments:
Post a Comment