ఆర్టీసీ ఉద్యోగులకూ ‘60’
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ రవాణా శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని చాలా కాలం నుంచి యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా అందులోని ఉద్యోగుల పదవీ విరమణ వయసును సాధారణ ప్రభుత్వోద్యోగుల తరహాలోనే 60 ఏళ్లకు పెంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికలోనూ వయసు పెంపునకు సూచించినట్టు ఆ జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ఆ సిఫారసు మేరకు పదవీ విరమణ వయసు పెంచినట్టు తెలిపింది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎంకు కృతజ్ఞతలు తెలిపాయి.ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీలోని 52,000 మంది కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.
No comments:
Post a Comment