మైనార్టీ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు
క్రైస్తవ, దూదేకుల సాహెబ్(నూర్‌బాషా) విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ క్రైస్తవ(మైనార్టీల) ఆర్థిక సంస్థ, ఏపీ దూదేకుల(నూర్‌బాషా) ఫెడరేషన్ ఎండీ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో 1-10వ తరగతి విద్యార్థులు వచ్చే నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వీరికి కుటుంబ వార్షికాదాయం పరిమితి రూ.1 లక్ష అని తెలిపారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షి్‌పలకు ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ విద్యార్థులు వచ్చే నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీరి కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలని పేర్కొన్నారు. అలాగే, ఇంజినీరింగ్, వైద్య, ఇతర వృత్తివిద్య-సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల విద్యార్థులు మెరిట్ కం మీన్స్ స్కాలర్‌షి్‌పకు వచ్చే నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వీరి కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ.2.50 లక్షలని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు, మేనేజ్‌మెంట్ కోటాకు చెందిన వారు కూడా దీనికి అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఆయా జిల్లాల మైనార్టీ సంక్షేమ అధికారిని లేదా క్రైస్తవ, దూదేకుల(నూర్‌బాషా) కార్యాలయం (ఫోన్ నెంబర్లు 8897652340, 9581343444)లో సంప్రదించాలని సూచించారు. www.scholarships.gov.in వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

No comments:
Post a Comment