పాఠశాల విద్యలో కే12 విధానం
సీనియర్ సెకండరీ విద్యగా ఇంటర్
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్‌ను విలీనం చేయనున్నారు. విలీన అనంతరం ఇంటర్‌ను సీనియర్ సెకండరీ విద్యగా పరిగణిస్తారు. విద్యలో సంస్కరణలకు బాలకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ ఆదివారం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడంపై చర్చించారు. పాఠశాల విద్యలో కే12 విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఈ విధానం ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను (ఎల్‌కేజీ, యూకేజీ) ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాల్సి ఉంటుంది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను నిర్వహిస్తున్నందున వాటిని బలోపేతం చేయడమా? లేదంటే సర్కారు బడుల్లోనే పూర్వప్రాథమిక విద్యను ఏర్పాటు చేయడమా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వచ్చే 3 నెలల్లో విద్యాశాఖలో తీసుకోవాల్సిన సంస్కరణలపై ఈ నెల 29న ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధిత కమిటీ ఒక నివేదికను అందజేయనుంది. అనంతరం సీఎం ఆదేశాల మేరకు తుది నివేదికను సమర్పించే అవకాశం ఉంది. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, పాఠశాల విద్యలోని విభాగాల హేతుబద్ధీకరణ, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి తదితర అంశాలను కమిటీ తన నివేదికలో పేర్కొననుంది.

No comments:
Post a Comment