"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం
★ తేది : 21.10.2019
★ విషయము : తెలుగు
★ పాఠం పేరు : "నీడ ఖరీదు"
★ తరగతి : 5వ తరగతి
★ సమయం : 11-00 AM
★ నిర్వహణ సమయం : 30 ని.లు
నీడ ఖరీదు
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• పాపయ్య యొక్క పిసినారి తనాన్ని అవగాహన చేసుకుంటారు.
• సమాజంలోని వ్యక్తుల యొక్క మనస్తత్వాలను అంచనా వేయగలుగుతారు
• పాఠ్యాంశంలోని హాస్యాన్ని విని ఆనందిస్తారు.
• పిసినారి పాపయ్యలోని పిసినారి తనాన్ని పోగొట్టిన శివయ్య తెలివితేటల్ని అభినందిస్తారు
• ఆట ఆడడంద్వారా శారీరక ఉత్సాహాన్ని, పాట వినటం, పాడడం ద్వారా మానసిక ఉల్లాసాన్ని పొందుతారు.
బోధనాభ్యసన సామగ్రి:
• పాఠ్యాంశ చిత్రాలను గీచిన చార్టులు 2. పాఠ్యపుస్తకం 3. పాట రాసి ఉంచిన చార్టు
బోధనాభ్యసస కృత్యాలు :
ఆట: కార్యక్రమంలో నిర్వహించబోయే 'ఆట'ను ఆడించే విధానం గురించి తెలుసుకొని ఉండాలి.
• తరగతి గది మధ్యలో ఒక విద్యార్థి చెట్టులాగా నిలబడాలి.
• ఆ విద్యార్థికి కొంత దూరంలో మరొక విద్యార్థి సూర్యుడిలాగా నిలబడాలి
• మిగిలిన పిల్లలందరూ రేడియోలో మ్యూజిక్ వస్తున్నప్పుడు చెట్టు చూట్టూ అంటీ చెట్టులాగా నిలబడిన విద్యార్థి చుట్టూ ఒకసారి తిరిగి, నీడ పడేవైపు కూర్చోవాలి.
• తరువాత సూర్యుడి స్థానాన్ని (సూర్యుడిలా నిలబడిన విద్యార్థి స్థానాన్ని) బట్టి చెట్టు నీడ ఎటువైపు ఉంటుందో పిల్లలంతా ఆ నీడలో కూర్చోవాలి. .
• సూర్యుడిలా నిలబడే విద్యార్థి స్థానాన్ని మార్చుతూ, రేడియో టీచర్ సూచనల ప్రకారం ఆటను ఆడించాలి.
కృత్యాలు : కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై అవగాహన కలిగి ఉండాలి.
కృత్యము :1
రేడియో టీచర్ చెప్పే 5 పదాలను తరగతి గదిలోని టీచర్ నల్లబల్ల పై గాయాలి.
1. పిల్లికి బిచ్చం పెట్టు 2. రుసరుసలాడు 3. ముఖం చిట్లించుకొని 4. కాలికి బుద్ధి చెప్పు 5. నిప్పులు చెరుగు.
సంభాషణల ద్వారా విన్న పాఠ్యాంశం పై రేడియో టీచర్ సూచనలను అనుసరించి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క పదానికి సొంత వాక్యాలు చెప్పించాలి.
2. ఆ ప్రశ్నలకు రాజు,లత చెప్పే సమాధానాలతో సరి చూసుకోవాలి.
కృత్యము :2
పాఠ్యపుస్తకంలో 11 వ పేజీలోని మొదటి పేరాను పిల్లలు అర్థం చేసుకుంటూ " చదవాలి, రేడియో టీచర్ అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాలి.
కృత్యాలు :
కార్యక్రమములో ప్రసారమయ్యే పాటను చార్డుపై స్పష్టంగా రాసి తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట (పాఠం పై గేయం):
పల్లవి :
విన్నారా బాలల్లారా - ఇది ఒక వింత కథ
చెట్టు నీడనే అమ్మివేసిన - పిసినారి పాపయ్య కథ //విన్నారా..//
చరణం 1:
బాటసారిగా వచ్చిన శివయ్య - చెట్టు నీడన సేద దీరెను
నా చెట్టు నీడలో పడుకోవద్దని - పాపయ్యేమొ మందలించెను
పిసినారి బుద్ధిని మార్చడానికి -శివయ్య తెలివిగ పథకమల్లెను
లోభితనముగల పాపయ్య - చెట్టు నీడను అమ్మివే సెను. //విన్నారా..//
చరణం 2:
నీడను కొన్న శివయ్య -పాపయ్య ఇంటిలో పాగావేసెను
నీడతోపాటు తోట్లో కెళ్ళి - కాయ గూరలు కోసుకెళ్లెను
నీడ ప్రాకిన ప్రాంతమునంతా -శివయ్య తెలివిగ ఆక్రమించెను
తగినశాస్తి జరిగిందంటూ -ఉళ్ళోవాళ్ళు హేళన చేసెను. //విన్నారా..//
చరణం 3:
లబోదిబోమని పాపయ్య -గ్రామ పెద్దకు ఫిర్యాదు చేసెను
విషయం విన్న గ్రామం పెద్ద –శివయ్య పనిని సమర్థించెను
బుద్ధి వచ్చెనని పాపయ్య -మనసు మార్చుకొని మనిషిగ మారెను చెట్టుక్రిందకు వచ్చిన వారికి -తోచిన పొయం చేయసాగెను.
//విన్నారా..//
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:
Post a Comment