డిసెంబరు 21 నుంచి స్మార్ట్‌హెల్త్‌కార్డులు
ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రయోజనం
ఈనాడు ముఖాముఖిలో ఆరోగ్యశ్రీ సీఈఓ మల్లికార్జున

ఈనాడు, అమరావతి: ‘‘ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే 1.44 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం డిసెంబరు 21 నుంచి స్మార్ట్ హెల్త్‌కార్డులు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి క్యూఆర్ కోడ్ కలిగిన కార్డు అందచేస్తారు. అనుబంధ ఆసుపత్రులకు వెళ్లి దాన్ని చూపిస్తే వైద్య సేవలు అందుతాయి. అత్యవసర సమయాల్లో తెల్లరేషన్‌కార్డు, ఆధార్‌కార్డు లేకున్నా వాటి నంబర్లు చెప్పినా వైద్యసేవలు అందించేందుకు చర్య తీసుకుంటామన్నారు. స్మార్ట్‌హెల్త్ కార్డులతో ఆ సమస్యకూ పరిష్కారం దొరుకుతుంది’’ అని ఆరోగ్యశ్రీ విభాగం ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) డా.ఎ.మల్లికార్జున తెలిపారు.
‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. రోగులకు వైద్యసేవలు ప్రారంభించేందుకు ఆస్పత్రులు అనుమతి కోరిన 6 నుంచి 12 గంటల్లోనే ఆమోదం తెలుపుతున్నట్టు చెప్పారు. విజ్ఞప్తుల పరిశీలనకు ప్యానల్ వైద్యుల సంఖ్య పెంచాం. అత్యవసర కేసుల్లో ఫోన్ ద్వారా అనుమతులిస్తున్నాం అన్నారు. ‘‘రోజూ 2,500 నుంచి రూ.3 వేల వరకు విజ్ఞప్తులు వస్తాయి. వాటిలో 5% కేసులకే అనుమతిచ్చేందుకు 24 గంటల వరకు సమయం పడుతోంది. దీన్ని తగ్గించేందుకూ కృషి చేస్తున్నాం’’ అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే తెల్లరేషన్‌కార్డుదారులు నవంబరు 1 నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లోని ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాల్టీ, క్రిటికల్ కేర్ వైద్య సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నామన్నారు. శస్త్రచికిత్స అనంతర విశ్రాంతి సమయంలో రోగికి రోజుకి రూ.220 ఇవ్వబోతున్నాం. దీనిద్వారా ఏడాదికి లక్ష మంది వరకు ప్రయోజనం పొందుతారు.
ఇతర అంశాలు...
* ఆసుపత్రుల యాజమాన్యాలకు రూ.103 కోట్ల వరకు బకాయిలు చెల్లించాం. మరో రూ.120 కోట్లు చెల్లించనున్నాం. ఉద్యోగులు తమ వంతుగా చెల్లించే మొత్తం (కంట్రిబ్యూషన్) అక్టోబరు నుంచి పెరుగుతోంది. దీంతో బకాయిల చెల్లించేందుకు వెసులుబాటు లభిస్తుంది.
* ఉద్యోగుల వైద్యసేవల బిల్లులకు నెలరోజుల్లోగా ఆమోదం తెలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాన్ని మూడు వారాలకు తగ్గించేందుకూ కృషి చేస్తున్నాం.
* జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అదనంగా 1000 రకాల వైద్య సేవలు అందుబాటులోనికి తెస్తున్నాం. ఆ రోజు నుంచే మిగతా జిల్లాల్లో అదనంగా 200 రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం. వాటిలో డెంగీ వంటి జ్వరాలు ఉంటాయి.
* వైద్యసేవలు పొందేందుకు వెళ్లినప్పుడు ఆసుపత్రుల నుంచి సమస్యలు వస్తే తొలుత ఆరోగ్యమిత్రలను, తర్వాత జిల్లా సమన్వయకర్తలను సంప్రదించాలి.
అనవసర వసూళ్లకు పదిరెట్ల జరిమానా
* ఆసుపత్రుల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులకు తాత్కాలికంగా అనుబంధ గుర్తింపు రద్దుచేశాం. రూ.కోటిన్నర వరకు జరిమానా విధించాం. ఓ కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యం ఓ రోగి నుంచి అనవసరంగా రూ.1.20 లక్షలు తీసుకోగా, పదిరెట్లు జరిమానా విధించాం. రోగుల నుంచివచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ప్రత్యేక విభాగం ఉంది.
* రూ.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖను సంప్రదించాం.

No comments:
Post a Comment