ఒకటి నుంచి 'ఏపీ సమగ్ర శిక్ష'
ఇకపై ఒకే గొడుగు కిందకు ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ, డైట్
డీఈవోకు సర్వాధికారాలు
త్వరలో ఏపీసీ నియామకం
కోర్టును ఆశ్రయించే యోచనలో పీవోలు ?
సర్వశిక్షాభి యాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాభియాన్ (ఆర్ఎం ఎస్ఏ), ఉపాధ్యాయ వృత్తి శిక్షణ కేంద్రాలు (డైట్) లను ఒకే గొడుగు కిందకు తెస్తూ వాటిని ఏపీ సమగ్ర శిక్ష సొసైటీలో విలీనం చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. విలీన ప్రక్రియను వేగ వంతం చేసేందుకు ఈనెల 31వ తేదీన గడువుగా నిర్దేశిం చడమేగాక నవంబరు 1వ తేదీ నుంచి మూడు విభాగాల విలీనంతో నూతనంగా ఏర్పాటవుతున్న ఏపీ సమగ్ర శిక్షసొసైటీ పేరిట కార్యకలాపాలు నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. విలీన ప్రక్రియలో తొలిదశగా సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి (డీపీవో) పోస్టును రద్దు చేస్తూ, ఆ స్థానంలో అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ)లను నియమించడంతో పాటు, ఎక్స్ అఫిషియో జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ (డీపీసీ) బాధ్యతలను జిల్లా విద్యాశాఖాధికారికి పదవి ఇస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. మలిదశగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈనెల 31వ తేదీ లోగా ఆర్ఎంఎస్ఏలో పని చేస్తున్న సిబ్బందిని, వినియోగిస్తున్న వాహనాలను, అన్ని ఒప్పందాలను, స్థిర, చరాస్తులను ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఏ డీపీవోకు అప్పగించాలని ఆదేశించారు.
ఒకటి నుంచి నూతన పాలన...
ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఏ జిల్లా ప్రాజెక్టు అధికారి స్థానే అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ (ఏపీసీ)లను త్వరలో నియ మించే అవకాశం ఉంది. ఆ మేరకు ఏపీ సమగ్ర శిక్ష సొసైటీ ఎక్స్ అఫిషియో జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా (డీపీసీసెకండరీ) డీఈవో వ్యవహరిస్తారు. ఇకమీదట డీఈవో నియంత్రణలోనే సమగ్ర శిక్ష కార్యకలాపాలు జరుగుతాయి. ప్రాజెక్టులో చేపట్టే పనులన్నింటిని డీపీసీ/డీఈవో అనుమతి, ఆమోదాన్ని ఏపీసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ శిక్షణలకు సంబంధించినవన్నీ డీఈవో అప్రూవల్ తోనే నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆర్ఎంఎస్ఏలో ఉన్న ఏవో పోస్టును గాని, ఎన్ఎస్ఏలో ఉన్న ఎన్ఏవో పోస్టుగాని ఒక దానిని రద్దు చేయనున్నారు. సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ అధికారుల పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేయడం లేదా అవుట్ సోర్సింగ్ లో సిబ్బందిని నియమించడం చేసే అవకాశం ఉంది.
కోర్టుకు వెళ్ళే యోచనలో...
ఇతర శాఖల నుంచి (ఫారిన్ సర్వీసులపై) సర్వశిక్షా భియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారులుగా డిప్యూటేషన్‌పై పని చేస్తున్న విధానం ఇప్పటి వరకు కొనసాగింది. దీనివల్ల డీఈవోలకు, డీపీవోలకు పలు విషయాల్లో సమన్వయ లోపం, విభేదాలు తలెత్తుతున్నాయి. దీనికితోడు ఎవరైనా పీవో అవక తవకలకు పాల్పడినట్టు రుజువైతే వారిపై చర్యలు తీసుకునేం దుకు శాఖాపర మైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డీపీవోల స్థానే కొత్తగా నియమించనున్న ఏపీసీ లను విద్యాశాఖకు చెందిన డీవైఈవో, అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ గల అధికారులనే నియమించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్రంలో కర్నూలు, నెల్లూరు డీపీవోలు మాత్రమే విద్యాశాఖకు చెందినవారు. మిగతావారంతా ఇతర శాఖల నుంచి డిహ్యటేషన్లపై పని చేస్తున్నవారే. దీనిలో కొందరు ఆరునెలల క్రితమే నియమితులు కాగా, మరికొంద రు రెండు నుంచి మూడేళ్లుగా డీపీవోలుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కసారిగా డీపీవోలను తొలగించాలని చేస్తున్న యత్నాలను కొందరు అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. తమను ఉన్నఫళంగా డీపీవో స్థానాల నుంచి తొలగిస్తే మాతృశాఖల్లో తగిన చోట ఖాళీలు లేవన్న విషయా న్ని పేర్కొంటూ డీపీవోలుగానే మరికొంతకాలం కొనసాగేం దుకు కోర్టును ఆశ్రయించాలని కొందరు యోచిస్తున్నట్టు సమాచారం.

No comments:
Post a Comment