కోటిన్నర మందికి ఉచిత కళ్లజోళ్లు
‘కంటివెలుగు’లో అందజేయనున్న రాష్ట్రప్రభుత్వం
రూ.250 కోట్ల వరకు వ్యయం
కంటివెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రూ.250 కోట్ల వరకు వ్యయం చేయబోతున్నారు. మరో ఎనిమిది లక్షల మందికి క్యాటరాక్ట్, ఇతర శస్త్ర చికిత్సలు జరుపుతారు. ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మొత్తం రూ.560 కోట్లను కేటాయించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 2022 జనవరి 31వ తేదీ వరకు 6 దశల్లో కంటి వెలుగు కార్యక్రమాలు జరిగేలా వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఒక్కో కిట్ వ్యయం రూ.150
తొలి, రెండు దశల్లోభాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 70 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్దేశిత చార్టులోని అక్షరాలను పది అడుగుల దూరం నుంచి వారి చేత చదివిస్తూ కుడి, ఎడమ కంటి చూపును పరీక్షిస్తారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు టార్చ్‌లైట్, చార్టు, టేపును కిట్ రూపంలో పంపిణీ చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఒక్కో కిట్‌కు రూ.150 వరకు ఖర్చుపెడుతున్నారు.
మూడు నుంచి ఆరు దశల్లో.. సుమారు 4 కోట్ల మందికి కంటి పరీక్షలు జరుపుతారు. అనంతరం అవసరమైన వారికి శస్త్రచికిత్సలూ చేపడతారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు శస్త్రచికిత్సలు చేసిన సంస్థలకు చెల్లింపులు జరుగుతాయి. డయాబెటిక్ రెటినోపతి, చైల్డ్‌హుడ్ బ్లైండ్‌నెస్, గ్లకోమా కేసులకు రూ.2 వేల చొప్పున చెల్లించనున్నారు.
అంధత్వంలో 80 శాతం సమస్యలను ముందస్తు పరీక్షల ద్వారా తగ్గించవచ్చని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ఈ పథకం అమల్లోభాగంగా తాత్కాలికంగా 400 ఆఫ్తమాలిక్ అసిస్టెంట్ నియామకాలు చేపట్టబోతున్నామని ఆయన తెలిపారు.

No comments:
Post a Comment