పదింతల పరీక్ష
విద్యా సంవత్సరం మధ్యలో పది ప్రశ్నపత్రం మార్పుపై తల్లిదండ్రుల ఆందోళన
సన్నద్ధతకు సమయం లేదని ఆవేదన
రాత పరీక్షతోనే విద్యార్థికి మార్కులు
పదింతల పరీక్ష
పదో తరగతి పరీక్షల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో కొత్త విధానాన్ని ప్రకటించినందున సన్నద్ధతకు సమయం సరిపోదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కీలక మార్పులను విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రకటించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కాగా సెప్టెంబరు 26న ఈ సంస్కరణలను ప్రభుత్వం ప్రకటించింది. మరో నెలలో ఆరు నెలల పరీక్ష లు (సమ్మెటివ్-1) జరగనున్న తరుణంలో తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటికే 80శాతం పాఠ్యాంశాలు పూర్తయ్యాయి. గతంలో అంతర్గత మార్కులను 20 కేటాయించేవారు. వాటిని పూర్తిగా తొలగించారు. ఈ మార్కులను ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా వేసుకుంటున్నాయన్న ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పదింతల పరీక్ష
ప్రశ్నలకు ప్రాధాన్యం
గతంలోని ప్రశ్నపత్రంలో బిట్‌పేపర్‌కు 25శాతం వెయిటేజీ ఉంది. దీన్ని ప్రస్తుతం 12శాతానికి తగ్గించారు. రెండు పేపర్లలో కలిపి గతంలో 40బిట్లకు 20 మార్కులు ఉండగా.. కొత్త విధానంలో 24 సూక్ష్మ లఘుప్రశ్నలకు 12 మార్కులు కేటాయించారు. బిట్లలో మిగిలిన 8మార్కులు, తొలగించిన 20 అంతర్గత మార్కులను ప్రశ్నలుగా మార్పు చేశారు. దీంతో రాత ప్రశ్నల సంఖ్య పెరిగింది. ఫలితంగా విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. గతంలో చివరి అరగంటలో బిట్‌పేపర్ ఇచ్చేవారు. అవి బహుళైచ్ఛిక ప్రశ్నలు కావడంతో విద్యార్థులు వేగంగా సమాధానాలను గుర్తించేవారు. ఇప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాల్సి వస్తుంది. ఇది సాధారణ విద్యార్థులకు కష్టతరమే. లోగడ ఒక వాక్యం ప్రశ్నలు నాలుగు ఇచ్చేవారు. ఇప్పుడు 8మార్కులకు ఇవ్వనున్నారు.
పుస్తకం చదివితేనే మార్కులు
భౌతికశాస్త్రానికి సంబంధించి పాఠ్యపుస్తకం చదివితేనే మార్కులొస్తాయి. గైడ్లు, మెటీరియల్ ఉపకరించవు. ప్రశ్నపత్రం మార్పు నేపథ్యంలో బోధన విధానం కూడా మారాలి.
ఆర్టికల్స్, టెన్సెస్‌కు ప్రాధాన్యం తగ్గింది
ఆంగ్లంలో ఆర్టికల్స్, టెన్సెస్‌కు ప్రాధాన్యం తగ్గింది. గతంలో రెండేసి మార్కులు ఉండగా ఇప్పుడు ఒక్కో మార్కుకు పరిమితం చేశారు. పదసంపదను పరిశీలించే ప్రశ్నలు విద్యార్థుల మేధకు పదును పెడుతాయి.
ఇప్పుడు ప్రకటించడమేంటి?
ఇప్పటికే 80శాతం పాఠ్యాంశాల బోధనను బిట్‌పేపర్ విధానంలోనే పూర్తిచేశాం. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ ప్రకటించడమేంటి? దీని వల్ల విద్యార్థులు అయోమయానికి గురవుతారు.
విద్యార్థులు సన్నద్ధమవడానికి సమయం సరిపోతుంది. పిల్లల్లో సృజనాత్మకత, రీజినింగ్, మెంటల్ ఏబిలిటీ పెంపునకు ఈ మార్పు తీసుకొచ్చాం. బట్టీ విధానాన్ని తొలగించేందుకు ఇది ప్రయోజనకరం.
- సంధ్యారాణి, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ
పదింతల పరీక్ష
మారిన పరీక్ష విధానం ప్రకారం.. పాఠ్యపుస్తకాలను చదివేవారే ఎక్కువ మార్కులను సంపాదించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాత ప్రశ్నలు ఎక్కువగా ఉన్నందున అందమైన చేతిరాత, అక్షరదోషాలు లేకుంటేనే మార్కులు వస్తాయని పేర్కొంటున్నారు. పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదివితేనే వార్షికపరీక్షలో 10/10 జీపీఏ సాధించగలుగుతారని వివరిస్తున్నారు.
ఆంగ్లంలో డిక్షనరీ నైపుణ్యం, ఇచ్చిన వాక్యాలతో ప్రశ్నలను రూపొందించే విధానం విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టనుంది. విద్యాశాఖ విడుదల చేసిన నమూనా ప్రశ్నపత్రంలో ఆంగ్ల వ్యాకరణ ప్రశ్నలు నిర్దుష్టంగా లేవని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

No comments:
Post a Comment