Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

సందేహం--సమాధానం

సందేహం--సమాధానం
ప్రశ్న:
 సీనియర్ స్టెప్ అప్ తీసుకున్న తర్వాత జూనియర్ SPP-1A స్కేల్ తీసుకోవటం వల్ల సీనియర్ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నాడు.ఇపుడు సీనియర్ మరల స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నదా??
జవాబు:
➧ వీలు లేదు. స్టెప్ అప్ నిబంధనలు ప్రకారం సీనియర్ ఒకసారి మాత్రమే స్టెప్ అప్ చేసుకొనే వీలు ఉన్నది.
ప్రశ్న:
నేను ZPHS లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ కి ఉండవలసిన అర్హతలు అన్నీ కలిగి ఉన్నాను.నాకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి ఇస్తారా ?
జవాబు:
➧ అవకాశం లేదు
ప్రశ్న:
నా భార్య CPS ఉద్యోగి. ఆమె మరణించారు. ఇపుడు నేను ఏమి చేయాలి ?
జవాబు:
➧ CPS లో ఉన్న డబ్బులు కోసం 103--జీడీ ఫారం పూర్తి చేయాలి.సంబంధిత పత్రాలు జతపరచి DDO ద్వారా ట్రెజరీకి పంపాలి.వీరు వాటిని PRA ముంబై కి పంపాలి.వారు పరిశీలించి,మీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు.
ప్రశ్న:
వేసవి సెలవుల్లో పాఠశాల విధులు నిర్వహి0చటానికి జూనియర్ అసిస్టెంట్ లేకపోతే ఎవరిని నియమించాలి ?
జవాబు:
➧ ఆ స్కూల్లో సీనియర్ ఉపాధ్యాయునికి ముందు అవకాశం ఇవ్వాలి.
ప్రశ్న:
నేను జీత నష్టపు సెలవు పెట్టాను.EHS ప్రీమియం చెల్లించలేదు.ఇపుడు నేను ఏమి చేయాలి ?
జవాబు:
➧ చలానా ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.
ప్రశ్న:
నేను, మరొక టీచర్ ఇద్దరం ఒకే సారి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందాము.HM పదోన్నతికి మా ఇద్దరిలో ఎవరు సీనియర్ ?
జవాబు:
➧ Rc. No.142 తేదీ:11.8.2011 ప్రకారం SGTలో సీనియర్ ఐన ఉపాధ్యాయుడు ఎస్ఏ లో సీనియర్ అవుతాడు.వారికే ముందు HM పదోన్నతి వస్తుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND