75% హాజరుంటేనే ‘అమ్మఒడి’
‘అమ్మఒడి’కి మరో నిబంధన
‘డ్రాపవుట్స్’కు చెక్ పెట్టేందుకే..
తెల్ల రేషన్ కార్డు.. ఆధార్ తప్పనిసరి
తల్లి, తండ్రి లేదా సంరక్షకులకు 15 వేలు
మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ
ఏడాది జనవరి నుంచి అమలు చేయనున్న ‘అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం మరో ఆంక్ష విధించింది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు ఖచ్చితంగా 75ు ఉంటేనే ఈ పథకం కింద వారు అర్హులవుతారని స్పష్టం చేసింది. విద్యాసంవత్సరం మధ్యలోనే చదువును నిలిపివేస్తే(డ్రాపవుట్).. సదరు విద్యార్థులను ఈ పథకం నుంచి తొలగించనున్నారు. దీనిని అధిగమించేందుకు పాఠశాలలకు పిల్లలను ప్రతిరోజూ తప్పకుండా పంపాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ‘అమ్మఒడి’కి మార్గదర్శకాలను జారీ చేశారు.
ఈ పథకం కింద విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకునికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున అందిస్తుంది.
పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
దారిద్య్రరేఖకు దిగువన(బీపీఎల్) ఉన్న కుటుంబం అయి ఉండాలి.
కుటుంబానికి తెల్లరేషన్ కార్డు ఉండాలి.
లబ్ధిదారుడు/తల్లి ఆధార్ కార్డును కలిగి ఉండాలి.
విద్యార్థులకు ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాలి.
తల్లి మరణిస్తే సంరక్షకుడికి రూ.15 వేలు ఇస్తారు.
లబ్ధిదారుడి పిల్లలు 1 నుంచి 12 తరగతులలో ఏపీ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతూ ఉండాలి.
విద్యార్థి కనీసం 75% హాజరును కలిగి ఉండాలి.
రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ, పీఎ్‌సయూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అమ్మఒడికి అనర్హులు.

No comments:
Post a Comment