తెల్ల రేషన్‌కార్డు... ఆధార్ 'అమ్మఒడి' పథకానికి తప్పని సరి
* ప్రతి ఏటా జనవరిలో చెల్లింపు
* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్‌ను తప్పనిసరిగా కలిగిఉండాలి. ఈ మేరకు విధివిధానాలను ఖరారు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ' ఈ పథకం కింద లభ్ధిదారులుగా ఎంపికయ్యే తల్లులు రాష్ట్ర ప్రభు త్వ నిబంధనల ప్రకారం పేదరికపు రేఖకు దిగువన ఉండాలి. ఆ కుటుంబం కచ్చితంగా ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉండటంతో పాటు. లబ్ధిదారైన తల్లి తప్పనిసరిగా ఆధార్‌కార్డును కలిగి ఉండాలని, లేని పక్షంలో కనీసం దరఖాస్తు చేసుకుని ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితోపాటు ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలు కూడా సాధ్యమై నంత వరకు ఇవ్వాలని సూచించారు. వీరి తల్లులే పథ కానికి అర్హులని తెలిపారు. విద్యార్థుల తల్లి మరణించి ఉంటే వారి సహజసంరక్షకులుగా ఎవరైతే ఉంటారో, వారే పథకానికి లభ్ధిదారులవుతారని తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, జూనియర్ కళాశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ పథకం కింద లబ్ది పొందడానికి అర్హులు.
నిబంధనలు ఇవి
* పిల్లలు, ఎంతమంది చదువుతున్నా 15 వేల రూపాయలను మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది.
* రేషన్ కార్డును ఆరు దశల్లో పరిశీలిస్తారు.
* అనాథలు/వీధి పిల్లలకు చెల్లింపుపై సంబంధిత శాఖలతో సంప్రదించిన తరువాత తుది నిర్ణయం.
* విద్యార్ధి కనీసం 75శాతం హాజరును కలిగి ఉండాలి.
* పిల్లవాడు/పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యాసంవత్సరం వారు అనర్హులు.
* లబ్ధిదారుల ఎంపిక కోసం ఒక సమిష్టి వ్యవస్థను తీసుకురావాలి.
* రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, పిఎస్‌యు ఉద్యో గులు, ప్రభుత్వ ఉద్యోగాల పెన్షనర్లు (పిఎస్‌యు, సెంట్రల్ గవర్నమెంట్‌తో సహా), ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనర్హులు.
* లబ్దిదారులు జాతీయ బ్యాంకులో గానీ, గ్రామ పోస్ట్ ఆఫీస్‌లో గానీ ఖాతా కలిగి ఉండాలి.
* రూ.15వేలను ప్రతి ఏటా జనవరి నెలలో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది.
మానిటరింగ్ వ్యవస్థ
అమ్మఒడి పథకం అమలు కోసం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తారని ఉత్తర్వుల్లో తెలిపారు. విద్యా సంస్థల అధిపతులు ఇచ్చిన విద్యార్ధుల సమాచారాన్ని చైల్డ్‌ఇన్‌ఫో, యుడైస్, సివిల్ సప్లయిస్ ఇతర శాఖలు ధృవీకరించిన తరువాత జగనన్న అమ్మఒడి కింద అర్హులకు ఆర్ధిక సహాయం చెల్లిస్తారు. విద్యాసంస్థలు సరైన సమాచారాన్ని అందించాయో లేదో తక్షణమే తనిఖీ చేస్తారు. ధృవీకరించిన సమాచారాన్ని వాలంటీర్ డిజిటల్ రూపంలో పొందుపరుస్తారు. అర్హులైన లబ్దిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

No comments:
Post a Comment