ఆదాయపు పన్ను స్లాబ్స్, సేవింగ్‌లో కీలక మార్పులు! ప్రభుత్వానికి రూ.55,000 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను స్లాబ్స్ మార్చుతారనే ప్రచారం గత కొద్దికాలంగా సాగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. ట్యాక్స్ స్లాబ్‌లో మార్పులు చేయాలని టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది. ట్యాక్స్ స్లాబ్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రెజిమ్‌ను పూర్తిగా పునరుద్ధరించాలన్న టాస్క్ ఫోర్స్ నివేదికను అమలు చేస్తే ప్రభుత్వానికి రూ.55,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయలేదు
ట్యాక్స్ పోర్స్ సూచించిన దాని ప్రకారం ఏడాదికి రూ.10 లక్షలు ఆర్జించే వారిపై ట్యాక్స్ 10 శాతం, రూ.20 లక్షలు ఆదాయంపై 20 శాతం, రూ.20 క్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆర్జించే వారిపై 30 శాతం, రూ.2 కోట్లకు పైగా ఆర్జించే వారిపై 35 శాతం విధించాలని టాస్క్ ఫోర్స్ సూచించింది. ప్రస్తుత ఆదాయపు పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ట్యాక్స్ తొలగింపు...!
ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 37 శాతం ట్యాక్స్‌ను తొలగించాలని టాస్క్ ఫోర్స్ సూచించింది. ప్రావిడెంట్ ఫండ్, మెడికల్, ఎడ్యుకేషన్ ఖర్చులు, హౌసింగ్ లోన్స్, చారిటీ వంటి వాటి మినహాయింపులపై స్వల్ప మార్పులు సూచించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీంలు, ఇన్సురెన్స్ వడ్డీలపై తగ్గింపు సూచనలు చేసింది.
మూడు కేటగిరీలు..
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పాలనపై టాస్క్ ఫోర్స్ మూడు కేటగిరీలను సూచించింది. ఈక్విటీ, నాన్-ఈక్విటీ ఫైనాన్షియల్ అసెట్స్, ఇతర అన్ని ప్రాపర్టీలు. నాన్ ఈక్విటీ ఫైనాన్షియల్ అసెట్స్, ఇతర అన్ని ప్రాపర్టీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు పరిమితం చేయాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది.
ఈక్విటీలపై పన్ను...
12 నెలల కన్నా ఎక్కువ కాలం ఉన్న ఈక్విటీ ఆస్తుల అమ్మకంపై లాభాల కోసం 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నులు ప్రతిపాదించారు. షార్ట్ టర్మ్ పీరియడ్ ఈక్విటీస్‌పై 15 శాతం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను ప్రతిపాదించారు. 24 నెలలకు పైగా ఉన్న ఈక్విటీయేతర ఆర్థిక ఆస్తులపై అమ్మకం మీద లాభాలపై 20 శాతం, 36 నెలలకు పైగా ఉన్న ఈక్విటీయేతర ఆస్తులపై 20 శాతం పన్ను సూచించింది.
ప్రస్తుతం ఇలా...
ప్రస్తుతం ఈక్విటీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, జీరో కూపన్ బాండ్స్ వంటివి 12 నెలల కాలం మించితే లాంగ్ టర్మ్ అసెట్స్‌గా పరిగణిస్తున్నారు. డెబిట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, జ్యువెల్లరీని 36 నెలలు దాటితే లాంగ్ టర్మ్‌గా, రియల్ ఎస్టేట్ ఆస్తులను 24 నెలలు దాటితే లాంగ్ టర్మ్‌గా పరిగణిస్తారు.
సెక్యూరిటీ ట్రాన్సాక్షన్
ఈక్విటీలపై విధించే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ పన్నును నిలిపివేయాలని టాస్క్ ఫోర్స్ సూచించలేదు. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ పన్నుపై మార్పులు చేయాలని సూచించింది.
విదేశీ సంస్థలకు..
విదేశీ సంస్థలకు 25 శాతం ట్యాక్స్, వీటిని స్వదేశానికి రప్పిస్తే కనుక బ్రాంచీ లాభ పన్ను రేటును 15 శాతంగా చేయాలని నివేదిక సూచించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేయాలని, దీనికి బదులు ట్యాక్స్ డివిడెండ్స్‌ను సూచించింది.
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను స్లాబ్స్ మార్చుతారనే ప్రచారం గత కొద్దికాలంగా సాగుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. ట్యాక్స్ స్లాబ్‌లో మార్పులు చేయాలని టాస్క్ ఫోర్స్ నివేదిక ఇచ్చింది. ట్యాక్స్ స్లాబ్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రెజిమ్‌ను పూర్తిగా పునరుద్ధరించాలన్న టాస్క్ ఫోర్స్ నివేదికను అమలు చేస్తే ప్రభుత్వానికి రూ.55,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆదాయం పెరుగుతుంది
ట్యాక్స్‌ఫోర్స్ నివేదికని పూర్తిగా అమలు చేస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెబుతున్నారు. టాస్క్ ఫోర్స్ నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే బడ్జెట్‌లో ఈ సిఫార్సుల ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నివేదిక బహిరంగపరచలేదు. అయితే పన్నుల విధానంలో చాలా మార్పులను సూచించినట్లుగా తెలుస్తోంది.ఆదాయపు పన్ను మినహాయింపులో మార్పులు చేయలేదు
ట్యాక్స్ పోర్స్ సూచించిన దాని ప్రకారం ఏడాదికి రూ.10 లక్షలు ఆర్జించే వారిపై ట్యాక్స్ 10 శాతం, రూ.20 లక్షలు ఆదాయంపై 20 శాతం, రూ.20 క్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆర్జించే వారిపై 30 శాతం, రూ.2 కోట్లకు పైగా ఆర్జించే వారిపై 35 శాతం విధించాలని టాస్క్ ఫోర్స్ సూచించింది. ప్రస్తుత ఆదాయపు పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పులు చేయలేదు.
ట్యాక్స్ తొలగింపు...!
ప్రస్తుతం ఉన్న 15 శాతం నుంచి 37 శాతం ట్యాక్స్‌ను తొలగించాలని టాస్క్ ఫోర్స్ సూచించింది. ప్రావిడెంట్ ఫండ్, మెడికల్, ఎడ్యుకేషన్ ఖర్చులు, హౌసింగ్ లోన్స్, చారిటీ వంటి వాటి మినహాయింపులపై స్వల్ప మార్పులు సూచించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీంలు, ఇన్సురెన్స్ వడ్డీలపై తగ్గింపు సూచనలు చేసింది.
మూడు కేటగిరీలు..
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పాలనపై టాస్క్ ఫోర్స్ మూడు కేటగిరీలను సూచించింది. ఈక్విటీ, నాన్-ఈక్విటీ ఫైనాన్షియల్ అసెట్స్, ఇతర అన్ని ప్రాపర్టీలు. నాన్ ఈక్విటీ ఫైనాన్షియల్ అసెట్స్, ఇతర అన్ని ప్రాపర్టీలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు పరిమితం చేయాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది.
ఈక్విటీలపై పన్ను...
12 నెలల కన్నా ఎక్కువ కాలం ఉన్న ఈక్విటీ ఆస్తుల అమ్మకంపై లాభాల కోసం 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నులు ప్రతిపాదించారు. షార్ట్ టర్మ్ పీరియడ్ ఈక్విటీస్‌పై 15 శాతం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను ప్రతిపాదించారు. 24 నెలలకు పైగా ఉన్న ఈక్విటీయేతర ఆర్థిక ఆస్తులపై అమ్మకం మీద లాభాలపై 20 శాతం, 36 నెలలకు పైగా ఉన్న ఈక్విటీయేతర ఆస్తులపై 20 శాతం పన్ను సూచించింది.
ప్రస్తుతం ఇలా...
ప్రస్తుతం ఈక్విటీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, జీరో కూపన్ బాండ్స్ వంటివి 12 నెలల కాలం మించితే లాంగ్ టర్మ్ అసెట్స్‌గా పరిగణిస్తున్నారు. డెబిట్ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్, జ్యువెల్లరీని 36 నెలలు దాటితే లాంగ్ టర్మ్‌గా, రియల్ ఎస్టేట్ ఆస్తులను 24 నెలలు దాటితే లాంగ్ టర్మ్‌గా పరిగణిస్తారు.
సెక్యూరిటీ ట్రాన్సాక్షన్
ఈక్విటీలపై విధించే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్ పన్నును నిలిపివేయాలని టాస్క్ ఫోర్స్ సూచించలేదు. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ ప్లాన్స్ పన్నుపై మార్పులు చేయాలని సూచించింది.
విదేశీ సంస్థలకు..
విదేశీ సంస్థలకు 25 శాతం ట్యాక్స్, వీటిని స్వదేశానికి రప్పిస్తే కనుక బ్రాంచీ లాభ పన్ను రేటును 15 శాతంగా చేయాలని నివేదిక సూచించింది. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేయాలని, దీనికి బదులు ట్యాక్స్ డివిడెండ్స్‌ను సూచించింది.
No comments:
Post a Comment