బీఈడీ, డీఎడ్‌లకు ‘ఇంగ్లీషు’ డేంజర్.!
డీఎస్సీలో విద్యార్హతల మార్పులపై దృష్టి
ప్రశ్నార్థకంగా తెలుగు మీడియం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-8 తరగతుల బోధన ఆంగ్లంలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీని ప్రభావం తెలుగు మీడియంలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసిన వారిపై పడనుంది. వారికి ఆంగ్లంలో బోధించడం కష్టమవుతుంది.
రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో అన్ని సబ్జెక్టులకు (లాంగ్వేజీ పండిట్ల మినహా) ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీషు మీడియంలో చదివిన వారికే ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగు మీడియం అభ్యర్థులు రోడ్డున పడే ప్రమాదముంటుంది
బీఈడీ, డీఎడ్ కళాశాలల్లో ప్రవేశాలు మరింత తగ్గిపోతాయి. వందలాది కళాశాలలు మూతపడతాయి. సర్వీసులో ఉన్న వారికి ఆంగ్లంలో బోధనపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం దశల వారీగా సిద్ధమైంది.
వారికితోడుగా కొత్తగా డీఎస్సీలో తెలుగు మీడియం వారిని నియమిస్తే..ఆంగ్ల బోధనా మాద్యమానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతాయి. 1-8 తరగతులకు ఆంగ్ల బోధనా మాధ్యమాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో విద్యార్హతల అంశాలపై పలు కీలక మార్పులను ప్రభుత్వం చేయనున్నట్లు తెలిసింది.
ఇన్ సర్వీసు టీచర్లకు ఇక్కట్లే..
ఆంగ్లంలో బోధనపై ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు అసౌకర్యానికి గురవుతారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ), వివిధ సబ్జెక్టులకు చెందిన స్కూల్ అసిస్టెంట్లు సైతం తెలుగులో బోధనకే పరిమితమయ్యారు. ఆంగ్లంలో బోధించే విధంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చినప్పటికీ శత్వర ఫలితాలు ఉండబోవు.
1-8 తరగతుల్లో ఆంగ్ల భాషా బోధన కోసం జనవరి నుంచి మే వరకు 98 వేల ఉపాధ్యాయులకు దశల వారీగా శిక్షణ ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్థుల పరీక్షల సమయం జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది.
ఈ సమయంలో శిక్షణ అంటే ఉపాధ్యాయులు వేసవి సెలవుల్ని కోల్పోతారు. వారిపై ఒత్తిడి పెరుగుతుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను సమాంతరంగా కొనసాగించాలని ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు సూచిస్తున్నాయి.
500 మంది దాటితే..
ఉన్నత పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు దాటితే వాటిని జూనియర్ కళాశాలలుగా మారుస్తారు. ఉన్నత పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రభుత్వం భాగస్వామ్యం చేయనుంది. ఇక నుంచి పాఠశాల విద్య, ఇంటర్ విద్యలు ఒకే గూటి కింద పనిచేస్తాయి.
జిల్లాల్లోని జూనియర్ కళాశాలల అప్‌గ్రేడ్‌కు అనువుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఎంపికలో విద్యాశాధికారులు నిమగమయ్యారు. అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు నూతనంగా జూనియర్ లెక్చరర్లను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది.
15వేల పాఠశాలల ఆధునీకరణ
నాడు-నేడు పథకంలో భాగంగా మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15వేల పాఠశాలలను ఆధునికీరించనున్నారు. కార్పొరేట్/ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే లక్ష్యంతో నాడు-నేడు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ నెల 14న ఈ పథకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారు. మూడు దశల్లో పాఠశాలలను ఆధునీకరిస్తారు. ఈ పథకం కింద జిల్లాల వారీగా పలు పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు.
ఉత్తర్వుల్లో స్వల్ప మార్పు
రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమంలో తరగతులను వచ్చే ఏడాది నిర్వహించేందుకు వీలుగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది.
గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2021-22 సంవత్సరం నుంచి 9, 10 తరగతులను ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు.
కానీ దీనిని మార్పు చేసి, 2021-22 సంవత్సరంలో 9వ తరగతిలో, 2022-23 సంవత్సరంలో 10వ తరగతిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

No comments:
Post a Comment