ఆంగ్లభాషపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాం
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి
రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. జనవరి నుంచి మే వరకు వివిధ దశల్లో ఉపాధ్యాయులకు ఆంగ్లభాష బోధనపై శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. ఆంగ్లభాష నైపుణ్యాలను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సురేశ్ అన్నారు. దీనివల్ల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే అవకాశముంటుందన్నారు. ఆంగ్లభాషలో బోధించేందుకు 98 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ అవసరమని గుర్తించామని మంత్రి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 62.36 శాతం మాత్రమే ఆంగ్ల భాష అభ్యసిస్తున్నారని చెప్పారు. తెలుగు భాష వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. కచ్చితంగా అన్ని అంశాల్లో తెలుగు భాషను కూడా బోధిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇంగ్లిష్ మీడియం చదువులు ఎస్సీ, ఎస్టీలకు అందుబాటులో ఉండడం లేదని మంత్రి చెప్పారు. ఎస్టీలు 33.23 శాతం, ఎస్సీలు 49.61 శాతం, వెనుకబడిన వర్గాల వారు 62.5 శాతం, మిగిలిన వర్గాల వారు 82.62 శాతం ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్నారని చెప్పా రు. అయితే ఆంగ్ల బోధనకు ఇబ్బంది లేకుండా టీచర్లకు వేసవి కాలంలో శిక్షణ ఇస్తామన్నారు. భవిష్యత్‌లో జరిగే టీచర్ల నియామకాల్లో ఇంగ్లిష్ బోధన చేయగలిగే వారినే తీసుకుంటామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు, 2021-22లో 9వ తరగతి, 2022-23లో 10వ తరగతి విద్యార్థులకు పూర్తిస్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనతో పాటు మాతృభాషకు కూడా సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.

No comments:
Post a Comment