Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

మీ ఆధార్-రేషన్ కార్డు లింక్ చేశారా?

 మీ ఆధార్-రేషన్ కార్డు లింక్ చేశారా?

AADHAR CARD ⟺ RATION CARD

        మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేశారా? లేదంటే వెంటనే అనుసంధానం చేసుకోండి. లేదంటే ప్రభుత్వం అందించే ఎన్నో ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం దేశ
 తమ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు సహా ముఖ్యమైన పత్రాలను అనుసంధానం చేసుకోవాలని సూచిస్తోంది.
        ప్రభుత్వ పథకాలన్నింటి నుంచి ప్రయోజనాలను ప్రజలందరికి చేరువ చేసేందుకు కేంద్రం ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగానే ‘ఒక దేశం.. ఒక రేషన్ కార్డు’ అనే పథకాన్ని వచ్చే 2020 జూన్ 1 నుంచి దేశంలో ప్రారంభించనుంది. ఈ పథకం నుంచి ప్రయోజనాలు పొందాలంటే ప్రతిఒక్కరూ డిసెంబర్ 31లోగా తమ ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ తప్పక అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
      ఆధార్ కార్డుతో రేషన్ కార్డును ఎలా లింక్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? ఎన్ని విధాలుగా ఆధార్, రేషన్ అనుసంధానం ప్రక్రియ ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే :
 ➱కుటుంబ సభ్యులందరితో కూడిన ఆధార్ కార్డుల ఒరిజినల్స్ ఒక కాపీ ఉంచుకోవాలి.
➱ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం అందరి ఆధార్ కార్డులను సిద్ధం చేసుకోవాలి.
➱ రేషన్ కార్డు ఒక కాపీ (నకలు) జిరాక్స్ దగ్గర పెట్టుకోండి.
➱ బ్యాంకు పాస్ బుక్ కాపీ ఒకటి (మీ బ్యాంకు అకౌంట్.. ఆధార్ లింక్ చేయకపోతే)
➱ పాస్ పోర్టు సైజు ఫొటోగ్రాఫ్స్ అవసరం మేరకు
1 . Online Modeలో
 ఆధార్-రేషన్ కార్డు లింక్ :
➧ అధికారిక ఆధార్ uidai.gov.in లింకింగ్ వెబ్‌సైట్ విజిట్ చేయండి.
➧ Start Now బటన్ పై క్లిక్ చేయండి.
➧ మీ అడ్రస్ వివరాలు, జిల్లా, రాష్ట్రం పేరు ఎంటర్ చేయండి.
➧ మీది ఏ రకమైన Ration Cardలో ఆప్షన్ నుంచి ఎంచుకోండి
➧ రేషన్ కార్డుపై ఉన్న పథకం పేరును ఎంపిక చేసుకోండి.
➧ మీ రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
➧ మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
➧ మీకు వచ్చిన OTP ఎంటర్ చేయడంతో మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
➧ మీ దరఖాస్తు విజయవంతంగా వెరిఫై అయ్యాక ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ అయినట్టే.
2 . Offline Modeలో  ఆధార్ + రేషన్ కార్డు లింక్ :
⇒ PDS సెంటర్ లేదా Ration షాపు దగ్గరకు తప్పక వెళ్లాల్సి ఉంటుంది.
⇒ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ (రేషన్) షాపులో అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి.
⇒ ఒకసారి డాక్కుమెంట్లు సబ్మిట్ చేశాక.. సంబంధిత శాఖకు వెళ్తాయి.
⇒ ఆ తర్వాత మీకు ఈమెయిల్ లేదా SMS రూపంలో నోటిఫికేషన్ వస్తుంది.
⇒ అధికారులు మీ డాక్యుమెంట్లను వెరిఫై చేశాక మరోసారి మీకు నోటిఫికేషన్ పంపిస్తారు.
⇒ అంటే.. మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు విజయవంతంగా అనుసంధానమైనట్టే.
3. SMS ద్వారా  ఆధార్ + రేషన్ కార్డు లింకింగ్ :
➪ మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి UID SEED అని టైప్  కొంచెం Space ఇవ్వండి.
➪ వివరాలు ఎంటర్ చేయండి.
➪ ఆ తర్వాత 51969 అనే ఈ నెంబర్ కు SMS పంపండి.
➩ ఉదాహరణకు.. UID SEED MH POSC 9876543 123478789012 అని ఈ విధంగా ఎంటర్ చేయాలి.
➪ వెరిఫికేషన్ సక్సెస్ అయినట్టుగా మీకో నోటిఫికేషన్ వస్తుంది.
➪ మీ ఆధార్ కార్డుతో మీ రేషన్ కార్డు విజయవంతంగా అనుసంధానం ప్రక్రియ పూర్తి అయినట్టే.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND