డీఎస్సీ-2018 అభ్యర్థులకు పోస్టింగ్ లు..
ఈనెల 22న నియామక ఉత్తర్వులు అందజేత..
మెరిట్ జాబితా ఆధారంగా పోస్టింగ్..
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
విద్యాశాఖ ఆదేశాలు జారీ..
2,654 మందికి టీచర్ పోస్టులు
రేపు కౌన్సెలింగ్.. నియామక పత్రాలు జారీ
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు
డీఎస్సీ-2018లో ఉత్తీర్ణత సాధించిన 2,645 మందికి టీచర్ పోస్టులు దక్కాయి. వీరికి ఈనెల 22న జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఆదేరోజు నియామక పత్రాలు కూడా జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ తరఫున 1,544, ఆదర్శ పాఠశాలల్లో 645, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 323, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్‌లో 142 పోస్టులు భర్తీ చేయనున్నారు. డీఎస్సీ-2018 ద్వారా మొత్తం 7,902 పోస్టులు నోటిఫై చేయగా ప్రస్తుతం మొదటి జాబితాలో 2,645 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు వెలువడ్డాయి.
No comments:
Post a Comment