కొత్త ఏడాది తొలివారంలోనే ఏపీపీఎస్సీ నియామకాల క్యాలెండర్
ఉద్యోగ నియామకాల ‘క్యాలెండర్ ఇయర్’ను జనవరి తొలివారంలో జారీ చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు బుధవారం వెల్లడించారు. ఖాళీల వివరాల సేకరణ ప్రభుత్వం ద్వారా సాగుతోందని, త్వరలోనే ఆ వివరాలు కమిషన్‌కు అందుతాయన్నారు. గత నెల నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశంలో నిరుద్యోగులు, శిక్షణ రంగ నిపుణులు, ఎమ్మెల్సీల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను పరిశీలిస్తున్నామన్నారు. వాటిపై కమిషన్ స్పందనను గురువారం వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పనకు, తెలుగు అనువాద దోషాలు రాకుండా చూసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు నిర్వహించే శాఖాపరమైన పరీక్షల్లో రుణాత్మక (మైనస్) మార్కుల విధానాన్ని తొలగించినట్లు పేర్కొన్నారు.
పారదర్శకత పెంచేందుకు...
ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పెంచే విషయమై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) మధ్య బుధవారం ప్రాథమిక స్థాయి చర్చలు జరిగాయి. ఐఐఎం ప్రతినిధులతో ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు సమావేశమై ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాన్ని వివరించారు. పూర్తిస్థాయి సంప్రదింపుల తర్వాత ఏపీపీఎస్సీ, ఐఐఎం మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి.

No comments:
Post a Comment