"విందాం - నేర్చుకుందాం"
నేటి రేడియో పాఠం
➧ తేది : 12.12.2019
➧ విషయము : గణితము
➧ పాఠం పేరు : "ఆవరణలు -ప్రహరీలు (చుట్టుకొలత)"
➧ తరగతి : 5వ తరగతి
➧ సమయం : 11-00 AM
➧ నిర్వహణ సమయం : 30 ని.లు
ఆవరణలు -ప్రహరీలు (చుట్టుకొలత)
బోధనా లక్ష్యాలు:
విద్యార్థినీ విద్యార్థులు :
• చుట్టుకొలత భావనను అవగాహన చేసుకుంటారు.
• ఇచ్చిన ఆకారాలకు చుట్టుకొలతను కనుగొను సమస్యలను సాధించ గలరు. తగిన కారణాలు తెలుప గలుగుతారు.
• నిజ జీవితంలో అవసరమైన సందర్భాలలో వినియోగించుకో గలుగుతారు.
• ఇచ్చిన ఆకారాల అంచుల పొడవుల ఆధారంగా చుట్టుకొలతను కనుగొనగలుగుతారు.
బోధనాభ్యసన సామాగ్రి :
1. టేపు, 2. స్కేలు, 3. పాఠ్యపుస్తకం, 4. పాటను రాసిన చార్టు.
బోధనాభ్యసనకృత్యములు :
ప్రసార పూర్వ కృత్యాలు:
కార్యక్రమంలో నిర్వహించబోయే కృత్యాలపై స్పష్టమైన అవగాహన కలిగియుండాలి.
కృత్యం :1
• విద్యార్థి చేత టేపుతో తరగతి గది యొక్క అంచు పొడవు ఎంతో కొలవమనండి.
• కొలిచిన దానిని ఎంత ఉందో నల్లబల్లపై రాయించండి. ఇదే విధంగా గది నాలుగు వైపుల గల అంచులను కొలిపించండి.
• ఒక విద్యా ర్థిచే గది చుట్టుకొలత ఎంతో చెప్పమనండి.
కృత్యం : 2
• విద్యార్థులను మూడు గ్రూపులుగా ఏర్పరచండి.
• పాఠ్యపుస్తకంలోని 50 వ పేజీలోని కృత్యం చేయించండి.
• సమస్యలను గ్రూపుల వారీగా సాధించ మనండి.
పాఠ్యాంశ సంబంధిత రేడియో వినిపించబోయే పాట:
ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటను చార్టు పై స్పష్టంగా రాసి, తరగతి గదిలో ప్రదర్శించాలి.
పాట
పల్లవి :
ఇంటికి ప్రహరీ కట్టాలన్నా
పొలముకు కంచెను వేయాలన్నా
చుట్టుకొలతయే కావాలి
వాటి అంచులవెంబడి పోవాలి //ఇంటికి//
చరణం 1:
ఇచ్చిన ఆకారానికి అంచులు ఏవో గమనించండి
ఆ అంచుల పొడవులు కొలవండీ
అన్ని అంచుల పొడవుల మొత్తం
చుట్టు కొలతగా చెప్పండి //ఇంటికి//
చరణం 2:
బట్టలు కుట్టాలన్నా - దర్జీకి చుట్టుకొలతయే ఆధారం
భవనాలు కట్టాలన్నా - చుట్టుకొలత ఒక ఆధారం
ఆటలు ఆడే కోర్టును గీయాలంటే
ఇంక ఎన్నెన్నో సందర్భాలలో
చుట్టు కొలతలను ఉపయోగిస్తాం //ఇంటికి//
పాట ప్రసార సమయంలో
• మొదటిసారి పాట వచ్చే సందర్భములో చార్టులోని పాటను వేలితో లేదా పాయింటర్ తో చూపిస్తూ చదవాలి.
• రెండవ సారి పాటను, చార్టును చూపిస్తూ రేడియోలో వచ్చే పాటతో జతకలుపుతూ పాడించాలి.

No comments:
Post a Comment