ఆంగ్ల మాధ్యమంపై
అభిప్రాయసేకరణ
రాష్ట్రవ్యాప్తంగా 21న సమావేశాలు
ప్రత్యేకంగా దరఖాస్తు రూపకల్పన
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై తల్లిదండ్రుల అభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు, విద్యావేత్తల నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులు విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని ఆంగ్ల మాధ్యమంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా డిసెంబరు 20న హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఉత్తర్వులు తమ ఆదేశాలకు లోబడి ఉంటాయని, పాఠ్యపుస్తకాల ముద్రణకు ఖర్చు చేస్తే చర్యలు తప్పవని ధర్మాసనం హెచ్చరించింది. మరోవైపు ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యావేత్తలు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే పాఠశాలల తల్లిదండ్రుల కమిటీలు ఈనెల 7న ఆంగ్ల మాధ్యమంపై చర్చించి, మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు మద్దతుగా తీర్మానాలను సమర్పించాయి.
అన్ని చోట్లా ఒకే రోజు..
ఆంగ్ల మాధ్యమం కావాలా? లేదా తెలుగు మాధ్యమం కావాలా? అనే దానిపై తల్లిదండ్రుల నుంచి ఐచ్ఛికాలను తీసుకునేందుకు 21న సమావేశాలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ప్రత్యేకంగా ఒక దరఖాస్తును రూపొందించారు. అందులో ఆయా మాధ్యమాలకు ఎదురుగా ఖాళీ గడులను ఇచ్చారు. వీటిల్లో కావాల్సిన మాధ్యమం ఎదురుగా టిక్ మార్కు చేయాల్సి ఉంటుంది. అనంతరం దరఖాస్తులను తీసుకొని, ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులకు అందించాల్సి ఉంటుంది. 22న మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారులకు ఇవ్వాలి. 23న సాయంత్రం ఐదు గంటలలోపు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.
తల్లిదండ్రుల కమిటీకి దరఖాస్తు..
పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి దరఖాస్తు సమర్పించేలా నమూనాను రూపొందించారు. తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల్ని వచ్చే ఏడాది ఏ మాధ్యమంలో చదివించేది దరఖాస్తులో పేర్కొనాలి. ప్రస్తుతం చదువుతున్న తరగతి.. వచ్చే ఏడాది ఏ మాధ్యమంలో చదివించేందుకు ఇష్టపడుతున్నారో దరఖాస్తులో తెలియజేయాలి. తమ కోరికను పాఠశాల విద్యాశాఖకు తెలియచేయాలని కోరుతున్నట్లు దరఖాస్తు రూపొందించారు. ఫారం దిగువన తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం చేయాలి. వీటిని ప్రధానోపాధ్యాయులకు సమర్పించాల్సి ఉంటుంది.

No comments:
Post a Comment