Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

MANA BADI - NADU NEDU : మన బడి - నాడు నేడు --Circular MBNN/19-20/2 , Dated : 02/01/2020. CRP లు మరియు ప్రధానోపాధ్యాయుల పాత్ర గురించి - ఆదేశాలు జారీ

MANA BADI - NADU NEDU : మన బడి - నాడు నేడు 
Circular MBNN/19-20/2  , Dated : 02/01/2020.
CRP లు మరియు ప్రధానోపాధ్యాయుల పాత్ర గురించి - ఆదేశాలు జారీ 
మన బడి నాడు నేడు CRP, HM ల  పాత్ర, వారికి ఆదేశాలుమన బడి నాడు నేడు లో రాయాల్సిన రెజిస్టర్స్...తీర్మానాలు
Rc.19, Dt.2/1/2020

File No.ESE02/563/2019-CIVIL SEC-SSA
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ
సర్క్యూలర్.నెం. ఎంబిఎస్ఎన్/19-20/2, తేది: 2-1-2020
విషయము: మనబడి: నాడు- నేడు; సి.ఆర్.పిలు మరియు ప్రధానోపాధ్యాయుల పాత్ర గురించి - ఆదేశాలు జారీ.
నిర్దేశములు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ వారి ఉత్తర్వులు నెం. 87, తేది:30-11-2019.
          పైన పేర్కొనబడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము 'మనబడి: నాడు – నేడు' అనే ప్రభుత్వ ప్రాధాన్యత గల కార్యక్రమం మన రాష్ట్రంలో అమలు జరుగుచున్నది. దీనికి సంబంధించి ఒక వినూత్న పద్ధతిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా పనులు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చురుగ్గా పాల్గొనాలంటే వారిని ప్రేరేపించడం (Motivation) మరియు వారిని సౌలభ్యం (Facilitate) చేయడం అనేవి విద్యాశాఖ నుండి మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు నిర్వహించుటలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు క్లస్టర్ రిసోర్సు పర్సన్లు ముఖ్య బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఈ క్రింది విధులు నిర్వహించాల్సి ఉంటుంది..
1. ప్రతి పాఠశాలలోని తల్లిదండ్రుల కమిటి వారానికి ఒకరోజు (అనుకున్న రోజు, అనుకున్న సమయానికి) తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలి. దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయలు మరియు సీఆర్పీలు తప్పకుండా హాజరు కావాలి.

2. ప్రధానోపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుందరికీ ఫోన్లు చేసి, వారు ప్రతి వారం తప్పకుండా సమావేశం జరిగేలా బాధ్యత వహించవలెను.

3. ఆ సమావేశంలో తగు విషయాలను అంశాలను చర్చించి ప్రజాస్వామ్యయుతంగా అందరు కమిటీ సభ్యులు కలిసి నిర్ణయాలు తీసుకునేటట్లు సీఆర్పీ సులభతరం (Facilitation) చేయాలి.

4. ఆ సమావేశానికి గ్రామ/వార్డు సచివాలయం నుండి ఇంజినీర్ సహాయకుడు, సంక్షేమ విద్యా సహాయకులు తప్పకుండా హాజరు అయ్యేటట్లు చూసుకోవాలి..

5. మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి గారు, పట్టణ ప్రాంతాలలో సంబంధిత డిప్యూటీ ఇన్స్పెక్టర్ /మండల విద్యాశాఖాధికారి/ సీఆర్పీలు హాజరు అయ్యే టట్లు పర్యవేక్షించాలి.

6. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు ఎలాంటి కాంట్రాక్టరుకు పనులను కట్టపెట్టకుండా ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు చూసుకోవాలి. బినామీ కాంట్రాక్టర్ ద్వారా పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయులదే.

7. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు పెట్టిన వివరాలు అన్ని కూడా 'మనబడి: నాడు-నేడు' లెక్కల పుస్తకాలలో వ్రాయాలి. ఈ లెక్కల పుస్తకాలు గ్రామ/వార్డు సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులతో వ్రాయించాలి. ఒక వేళ ఆ పోస్టులో ఎవరు లేకపోతే సీఆర్పీలు ఆ లెక్కలు వ్రాయాల్సి ఉంటుంది.

8. మన బడి: నాడు-నేడు' కార్యక్రమానికి సంబంధించి ఈ క్రింది పుస్తకాలు వ్రాయాలి.
(i) మీటింగ్ మినిట్స్
(ii) నగదు పుస్తకం
(iii) సాధారణ లెడ్జర్
(iv) చెల్లింపు వోచర్
(V) రశీదు పుస్తకము
(vi) స్టాక్ నమోదు- పంపిణీ రిజిస్టర్

9. సీఆర్పీ మరియు ప్రధానోపాధ్యాయులు క్షేత్రస్థాయి ఇంజినీరు సహాయంతో తాపీ మేస్త్రీ , రంగులు వేసే మేస్త్రీ , కరెంట్ మేన్, ఫ్లోరింగ్ మేస్త్రీ , శానిటరీ మేస్త్రీ , ప్లంబింగ్ మేస్త్రీ  మొదలగు వారితో గంపగుత్త రేటు మాట్లాడటంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి సహాయపడాలి. మేస్త్రీ లతో రేటు మాట్లాడినప్పుడు ఒక పేజీ ఒప్పంద పత్రము తయారు చేసుకోవడానికి పాఠశఆల తల్లిదండ్రుల కమిటీకి సహాయం చేయాలి.

10. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కేంద్రీయ సరఫరా(central procurement) పద్ధతిలో ఫర్నీచర్, ఫ్యాన్లు, కమొడ్లు, ఆకుపచ్చ బోర్డులు వంటివి ఇండెంట్ తయారు చేయడానికి, దానిని కంప్యూటర్ ద్వారా పంపించడానికి ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

11. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కొన్న వస్తువులు లేక కేంద్రీయ సరఫరా (central procurement) ద్వారా వచ్చిన సామగ్రి/ వస్తువులు చాల జాగ్రత్తగా పాఠశాల ఆవరణలో భద్రపరచడంలో ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. సామగ్రి భద్రపరచడంలో క్షేత్ర స్థాయి ఇంజినీర్ బాధ్యత ఉండదు.

12. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ నిర్మాణ వస్తువులు/సామగ్రి కొనడానికి మార్కెట్ కు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీఆర్పీ గాని ప్రధానోపాధ్యాయుడు కాని ఎవరో ఒకరు తప్పకుండా వెళ్లవలెను.

13. మనబడి' అనే భావజాలంను, 'మన బడి ఒక పవిత్ర స్థలం' అనే భావజాలాన్ని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, ఇంజినీరుకు, తల్లిదండ్రులకు, టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు, సీఆర్పీలకు, గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికీ ఇలా ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగేటట్లుగా చేయడంలో ప్రధానోపాధ్యాయులు మరియు సీఆర్పీలు ముఖ్య పాత్ర పోషించవలెను.

14. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య సఖ్యత ఉండేట్లు, వారిలో ఏమైనా బేధాభిప్రాయాలు వచ్చినట్లయితే వాటిని పరిష్కరించే బాధ్యత సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి.

15. ఇంజినీర్ పాఠశాలకు వచ్చినపుడు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సమావేశపరిచి, పాఠశాలలో అందరు తిరిగి ఏమేమి కావాలో గుర్తించి ఇంజనీర్ అంచనాను తయారు చేసేట్లు ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు బాధ్యత తీసుకోవాలి.

16. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు , క్షేత్రీయ ఇంజనీర్, గ్రామ/వార్డు సచివాలయ ఇంజనీర్, సంక్షేమ విద్యా సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ అందరూ ఒక బృందంలా తయారు కావాలి.

17.  పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకూ ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా లెక్క తెలిసేటట్లుగా సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.

18. చివరగా పాఠశాల పనులను త్వరితగతిన చేయడంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సంస్థాగతంగా నడిపించి వారితో పాఠశాల పనులను పూర్తి చేయడంలో సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు ప్రధాన పాత్ర వహించాలి.

       పైన తెలిపిన మార్గదర్శకాలు అమలయ్యేటట్టుగా సంబంధిత మండల విద్యాశాఖాధికారి, డిప్యూటీ ఇన్స్పెక్టర్,
జిల్లా ఉపవిద్యాశాఖాధికారులు, అదనపు ప్రాజెక్ట్ అధికారి (సమగ్రశిక్షా), జిల్లా విద్యాశాఖాధికారులు అందరూ తగిన శ్రద్ధ తీసుకొని నిరంతరం పర్యవేక్షించి 'మన బడి: నాడు-నేడు' కార్య క్రమాన్ని విజయవంతం చేసి మన పిల్లలకు అద్భుతమైన పాఠశాల ఆవరణను, సౌకర్యాలను అందజేయాలని అందరినీ కోరుతున్నాను.

వాడ్రేవు చినవీరభద్రుడు
కమిషనర్, పాఠశాల విద్యాశాఖ (పూ.ఆ.బా)

రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరికీ (ఇట్టి నకలు ప్రతిని ప్రధానోపాధ్యాయులకు. సీఆర్పీలకు, మండల విద్యాశాఖాధికారులకు, ఉప విద్యాశాఖాధికారులకు పంపవలెను.)

ఈ సర్క్యూలర్ ను ఈ కింది వారికి సమర్పించడమైనది
1. పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారికి
2. ప్రభుత్వ సలహాదారు (మౌలిక సదుపాయాలు) వారికి, 

3. అన్ని జిల్లా కలెక్టర్లకు సమాచారం నిమిత్తం పంపడమైనది.




Download Circular 

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND