CTET July - 2020 పరీక్ష షెడ్యూలు ఇలా...
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జులై-2020 పరీక్ష షెడ్యూలును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం జులై 5న సీటెట్-2020 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి.. జనవరి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 24 వరకు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. జులై 5న దేశవ్యాప్తంగా 112 నగరాల్లో 20 భాషల్లో సీటెట్-2020 పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహించనుంది. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఉదయం 9.30 నుంచి 12 వరకు వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
సీటెట్ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఆయా పేపర్లకు అర్హతలు వేర్వేరుగా ఉంటాయి.. వివరాలు ఇలా..
ప్రైమరీ స్టేజ్ (1 నుంచి 5 తరగతులకు బోధించడానికి) (పేపర్-1)
-----------------------------------
CTET 2020 : పరీక్షలో అర్హత సాధించడం ద్వారా కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, టిబెటన్ పాఠశాలలు, ఇతర అన్‌ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలతోపాటు టెట్ నిర్వహించని రాష్ట్రాల్లోని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులుగా పనిచేయవచ్చు.
-----------------------------------
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
ఎలిమెంటరీ స్టేజ్ (6 నుంచి 8 తరగతులకు బోధించడానికి) (పేపర్ 2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు..
సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లు రాసేవారు రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లు రాసేవారు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
పేపర్-2: ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్‌మెంట్ &పెడగోజీ, లాంగ్వేజ్-1 , లాంగ్వేజ్-2 అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు.
➧పరీక్ష సమయం 3 గంటలు.
➧ నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలు...
➧ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.01.2020
➧ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.02.2020
➧ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 27.02.2020 (15:30 pm)
➧ పరీక్ష తేది: 05.07.2020
---------------------------
➤ Download Information Bulletin
➽ Online Application For CTET July 2020

No comments:
Post a Comment