Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

విద్యాశాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు!

విద్యాశాఖలో ఖాళీల భర్తీకి కసరత్తు!
➧విద్యాశాఖలోని ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. గత రెండు రోజులుగా అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. 
➧ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు నిర్వహించిన సమావేశంలో ఖాళీల వివరాలను సమర్పించారు. 
➧సచివాలయంలో గురువారం విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. 
➧పాఠశాల, జూనియర్‌ కళాశాలల్లో కలిపి సుమారు 14 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు అధికారులు నివేదికలు సమర్పించారు. 
➧ఇందులో జూనియర్‌ కళాశాలల్లో బోధన, బోధనేతర పోస్టులు 4,600 ఉండగా.. పాఠశాల విద్యలో 9,600 ఉన్నాయి. ప్రభుత్వం మొదట బోధన పోస్టుల భర్తీకి ప్రాధాన్యమిస్తోంది. 
➧విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికే ప్రకటించిన సహాయ ఆచార్యుల పోస్టుల ఖాళీలు 1,109 ఉన్నాయి. 
➧ఇవికాకుండా వర్సిటీల్లో మంజూరు పోస్టులు, పని చేస్తున్న వారి వివరాలను పంపాలని అధికారులు కోరారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND