ఐటీ శ్లాబులపై తొలగని సందిగ్ధం
రూ.13 లక్షలు దాటితే కొత్త విధానమే మేలు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయ పన్ను (ఐటీ) శ్లాబులు ఎవరికి మేలు చేకూరుస్తాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వార్షిక ఆదాయం రూ.13 లక్షల కంటే ఎక్కువ ఉండి, ఏటా రూ.2 లక్షల వరకు తగ్గింపు క్లెయిమ్ చేసే ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కొత్త విధానమే మేలని అధికార వర్గాలంటున్నాయి. అయితే వార్షిక ఆదాయం రూ.12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండి, ఏటా రూ.2 లక్షల వరకు పెట్టుబడుల తగ్గింపులు క్లెయిమ్ చేసే వారికి మాత్రం పాత విధానమే మేలని పేర్కొన్నాయి.
ఇదీ లెక్క
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 5.78 కోట్ల మంది ఐటీ చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో 5.3 కోట్ల మంది (90 శాతం) రూ.2 లక్షల కంటే తక్కువ మొత్తాన్ని తగ్గింపుగా క్లెయిమ్ చేస్తున్నారు. ప్రామాణిక తగ్గింపు, పీఎఫ్, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ, ఎన్‌పీఎస్ కంట్రిబ్యూషన్, జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపు వంటి వాటి ద్వారా వీరు ఈ తగ్గింపును క్లెయిమ్ చేస్తున్నారు.
రెండు కొత్త శ్లాబులు
ఐటీ లెక్కింపునకు సంబంధించి ఇప్పటికే 10, 20, 30 శాతం శ్లాబులు అమల్లో ఉన్నాయి. వీటికి తోడు ఆర్థిక మంత్రి సీతారామన్ కొత్తగా రూ.7.5-10 లక్షల వార్షిక ఆదా య వర్గాల కోసం 15 శాతం శ్లాబు, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారి కోసం 25 శాతం శ్లాబులను ప్రవేశపెట్టారు. వార్షిక ఆదాయం రూ.15 లక్షలు మించితే వారు 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తారు. ఎలాంటి మినహాయింపులు, తగ్గింపులు క్లెయిమ్ చేయని ఐటీ చెల్లింపుదారుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఈ కొత్త శ్లాబులు ప్రకటించారు.
ఎంత మేలంటే ?
వార్షిక ఆదాయం రూ.13 లక్షలపైన ఉండి రూ.2 లక్షల వరకు తగ్గింపులు క్లెయిమ్ చేస్తే పాత శ్లాబుల ప్రకారం రూ.1.48 లక్షలు పన్నుగా చెల్లించాలి
మినహాయింపులు, తగ్గింపులు లేని కొత్త విధానం ఎంచుకుంటే వీరు రూ.1.43 లక్షలు ఐటీగా చెల్లిస్తే సరిపోతుంది. అంటే పన్ను పోటు రూ.5,200 తగ్గుతుంది
అదే రూ.2 లక్షల తగ్గింపు క్లెయిమ్‌తో వార్షిక ఆదాయం రూ.14 లక్షలు మించితే రూ.10,400, రూ.15 లక్షలు మించితే రూ.15,600 ఆదా అవుతాయి
రూ.50,000 ప్రామాణిక తగ్గింపు లేని నాన్-శాలరీ వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.9.5 లక్షలు ఉండి రూ.1.5 లక్షల పెట్టుబడుల తగ్గింపు ఎంచుకుంటే వార్షిక పన్ను చెల్లింపు భారం రూ.5,200 తగ్గుతుంది

No comments:
Post a Comment