యువికా-యువ విజ్ఞాని
➧అంతరిక్ష కేంద్రాన్ని చూసొద్దాం రారండి
➧నేటి నుంచి దరఖాస్తులకు ఇస్రో ఆహ్వానం
➧9వ తరగతి విద్యార్థులకు భలే అవకాశం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘యువికా-యువ విజ్ఞాని’ పేరుతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
దరఖాస్తు ఇలా చేయాలి...
ఇస్రో ప్రధాన వెబ్‌సైట్ లో ఈ నెల 3 నుంచి 24వ తేదీ మధ్య దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థుల జాబితా మార్చి 2న ఇస్రో ప్రకటించాక పూర్తి వివరాలతో కూడిన ధ్రువపత్రాలను మార్చి 23లోగా అప్‌లోడ్ చేయాలి. వీటిని ఇస్రో అధికారులు పరిశీలించిన తర్వాత మార్చి 30న తుది జాబితా వెల్లడిస్తారు.
అర్హతలు ఇలా..
: యువికాలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో గతేడాది సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ సిలబస్‌ల్లో ఎనిమిదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అవకాశమిచ్చారు. విద్యాభ్యాస కాలంలో చూపిన ప్రతిభ ఆధారంగా ఇస్రో ప్రత్యేకాధికారులు ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా జరిగే వడపోతలో రాష్ట్రానికి ముగ్గురు చొప్పున అవకాశం కల్పిస్తారు.*
వెయిటేజీ ఇలా..
ఎంపికలో 8వతరగతిలో సాధించిన మార్కులను బట్టి 60శాతం వెయిటేజీ ఉంటుంది. 2016 నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వ్యాసరచన, వక్తృత్వ, చర్చా కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన వారికి 10శాతం, క్రీడల్లో ప్రతిభకు 10శాతం, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగాల్లో సభ్యులుగా ఉంటే 5శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదివే వారికి 15శాతం ఇలా ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేస్తారు.
రవాణా ఛార్జీల చెల్లింపు...
ఆయా కేంద్రాలకు వెళ్లేందుకు అయ్యే రవాణా వ్యయాన్ని ఇస్రోనే చెల్లిస్తుంది. రైలులో రెండోతరగతి ఏసీ ఛార్జీలను రానుపోనూ చెల్లిస్తుంది. విద్యార్థి వెంట వచ్చే సంరక్షకులు/తల్లిదండ్రుల్లో ఒకరికి రెండోతరగతి ఏసీ ఛార్జీలు ఇస్తుంది.*
ఎలాంటి సందేహాలున్నా 080-22172269 నంబరులో లేదా yuvika2020@isro.gov.in సంప్రదించవచ్చు.
ఏం చూపిస్తారంటే...
ఈ ఏడాది మే 11వ తేది నుంచి 22వ తేది వరకు ఇస్రోకు చెందిన అహ్మదాబాద్, షిల్లాంగ్, బెంగళూరు, తిరువనంతపురం అంతరిక్ష పరిశోధన కేంద్రాల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి, అంతరిక్షంలో సాధిస్తున్న ప్రగతి, సవాళ్లు; శాస్త్రవేత్తలు కావాలంటే ఏం చేయాలి.. ప్రయోగశాలల సందర్శన, నిపుణులతో చర్చాగోష్టి తదితర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు.
https://www.isro.gov.in

No comments:
Post a Comment