Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు

ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్సు
(G.O. (P) No.88 Fin & Ply. Dated 26-3-1980)
అర్హదాయక సర్వీసు: 18 సం|| వయస్సులోపు చేసిన సర్వీసు, అనారోగ్యం లేదా ఉన్నత విద్య కారణాలుకాక ఇతర కారణాలపై మంజూరైన జీతనష్టపు సెలవులో 36 నెలలకు మించిన కాలము, శిక్షగా నిర్ణయించిన సస్పెన్షన్ కాలము, కోర్టు స్టే పైన లేదా విద్యా సంవత్సరాంతం వరకు సర్వీసులో కొనసాగిన కాలము సర్వీసుగా పరిగణింపబడవు. (రూలు 13,21,23) మిగతా మొత్తం సర్వీసుగా పరిగణించ బడుతుంది. రెండు కంటే ఎక్కువ దఫాల ప్రభుత్వేతర, ప్రభుత్వ సర్వీసుల మధ్య అంతరాయాలు, రెండు దఫాల ప్రభుత్వేతర సర్వీసుల మధ్య అంతరాయాలు ఆటోమేటిక్ గా కండోన్ చేయబడతాయి. (రూలు 28), సర్వీసు 33 సం||లకు తగ్గితే 5 సం||లు (జిఓ. ఎంఎస్.నం. 100 ఆర్థిక,తేది 06.04.2010) మించకుండా వెయిటేజీ ఇవ్వబడుతుంది. (రూలు 29)
పెన్షన్:  10 సం||లు ఆ పై గల సర్వీసుకు మాత్రమే పెన్షన్ చెల్లించబడుతుంది. చివరి నెల వేతనం x 1/2x అర్థ సం|| సర్వీసు యూనిట్లు+66 అను సూత్రం ప్రకారం పెన్షన్ నిర్ణయించబడుతుంది. పైసలెన్నున్నా పై రూపాయికి సవరించబడుతుంది. చివరి నెల వేతనం కేవలం బేసిక్ పే గా మాత్రమే పరిగణించబడుతుంది. దానికి రిటైర్మెంటు మరుసటి రోజుగల ఇంక్రిమెంటును కూడా చేర్చి పరిగణించాలి. 3 నెలలు,ఆపైనవున్న సర్వీసును ఒక అర్థ సం|| యూనిటుగా పరిగణించబడుతుంది. (రూలు 45),
సర్వీసు గ్రాట్యుటీ : 10 సం||లలోపు సర్వీసు వుంటే, పెన్షన్ బదులు ఏడాది సర్వీసుకు 1 నెల వేతనం చొప్పున (రూలు 45 -(1)లోని పట్టిక ప్రకారం) సర్వీసు గ్రాట్యుటీ చెల్లించబడుతుంది.
రిటైర్మెంటు గ్రాట్యుటీ : 5 సం||లకు మించిన సర్వీసుతో రిటైరైన ఉద్యోగికి - (చివరి నెల వేతనం + డిఏ) X అర్థ సం|| సర్వీసు యూనిట్లు x 1/4 అను సూత్రం ప్రకారం (చివరి నెల వేతనం + డిఏ)కి 16.5 రెట్లు గరిష్ట పరిమితితో 12,00,000 రూపాయలకు మించకుండా గ్రాట్యుటీ చెల్లించబడుతుంది. గ్రాట్యుటీ మొత్తంలోని పైసలను పై రూపాయికి సవరించాలి (రూలు 46) జిఓ నం. 6 ఫైనాన్స్, తేది. 11.01.2016,
డెత్ గ్రాట్యుటీ: 1సం||లోపు సర్వీసుతో మరణిస్తే 3 సం||లు సర్వీసు చేసినట్లు భావించి చివరి వేతనానికి 1 1/2రెట్లు, 5 సం||లోపు సర్వీసుతో మరణిస్తే 9 సం||లు సర్వీసు చేసినట్లు భావించి 4 1/4 రెట్లు. 5సం|| పైబడి సర్వీసుంటే 18సం||లు సర్వీసు చేసినట్లు భావించి 9రెట్లు, 18సం||లకు మించి సర్వీసుంటే పై సూత్రం ప్రకారం డెత్ గ్రాట్యుటీగా చెల్లించబడుతుంది. (రూలు 46(3)
గ్రాట్యుటీ - నామినేషన్ - చెల్లింపు: 1. భార్య, 2. భర్త, 3. కుమారులు, 4. అవివాహిత కుమార్తెలు, 5. విధవరాళ్ళయిన కుమార్తెలు, 6. తండ్రి, 7. తల్లి, 8. 18 సం||లలోపు వయస్సున్న సోదరులు, 9. అవివాహిత / విధవరాళ్ళయిన అక్క చెల్లెళ్ళు, 10. వివాహిత కుమార్తెలు, 11. ముందే చనిపోయిన కుమారుని సంతానం-వీరు కుటుంబ సభ్యులు. ఉద్యోగంలో చేరగానే వీరిలో ఒకరినిగాని ఎక్కువ మందిని గాని పేర్కొంటూ నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ లేకపోతే 1 నుండి 4లోని వారికి, అట్టివారు లేకపోతే 5 నుండి 11లోని వారికి సమాన వాటాల్లో చెల్లించబడుతుంది. (రూలు 46, 47) గ్రాట్యుటీ చెల్లింపు 3 నెలలు మించి ఆలస్యమైతే 7%, 1 సం|| మించి ఆలస్యమైతే 10% వడ్డీ చెల్లించబడుతుంది.
కుటుంబ పెన్షన్ : కనీసంగా 7 సం||ల సర్వీసుతో ఉద్యోగి మరణించినప్పుడు అతని చివరి వేతనంలో 50% చొప్పునను, రిటైరైన పిదప మరణించినచో అతని చివరి వేతనములో 50%ను అతని పెన్షన్‌కు మించకుండా మంజూరు చేయబడుతుంది. ఉద్యోగి మరణించిన తేదీ నుండి 7 సం||ల వరకుగాని అతను జీవించివుంటే 65 సం|| వయస్సు నిండే వరకుగాని (ఏది ముందైతే అంతవరకు) చెల్లించబడుతుంది. ఆ తర్వాత నుండి చివరి వేతనంలో 30% చెల్లించబడుతుంది. 7 సం||ల కనీస సర్వీసు లేకుండా సర్వీసులో మరణిస్తే మొదటి నుండి 30% చొప్పున చెల్లించబడుతుంది.
కుటుంబ పెన్షన్ చెల్లింపు : నామినేషన్ అవసరం లేదు. ముందుగా భార్య / భర్తకు జీవితాంతం లేదా పునర్వివాహం వరకు, ఆ తర్వాత కుమారులకు 25 సం|| వయస్సు వచ్చేవరకు, అటు తర్వాత కుమార్తెలకు 25 సం||ల వయస్సు వచ్చే వరకు చెల్లించబడుతుంది. వితంతువులైన, విడాకులు పొందిన ఆధారిత కుమార్తెలకు అర్హత పొందేనాటికి 45 సం||లు నిండినవారు అర్హులు కారు. అయితే 45 సం||ల వయస్సులోపు గల ఆధారిత కుమార్తెలకు పిల్లలు లేనివారికి, 18 సం||లు వయస్సులోపుగల మైనర్ పిల్లలుగలవారికి, వారికి పునర్వివాహాం అయ్యేవరకు
లేదా సంపాదన ప్రారంభించేవరకు లేదా పిల్లలు మేజర్లు అయ్యేవరకు ఏది ముందు సంభవిస్తే అప్పటివరకు మాత్రమే ఫ్యామిలీ పెన్షన్చె ల్లించబడుతుంది (జిఓ ఎంఎస్ నం. 152 ఆర్థిక, తేది. 25.11.2019) ప్రాధాన్యతా క్రమంలో పైన తెలిపిన వారిలో అర్హులు లేకుంటే ఆధారిత తల్లిదండ్రులకు చెల్లించబడుతుంది. దివ్యాంగులైన పిల్లలకు వివాహం అయినప్పటికి జీవితాంతము కుటుంబ పెన్షన్ (జిఓ 221; తేది. 21.11.2016) చెల్లించబడుతుంది. కుటుంబ పెన్షనర్ స్వతహాగా ఉద్యోగి అయినా పెన్షనర్ అయినా, కుటుంబ పెన్షన్ పొందవచ్చు. కుటుంబ పెన్షన్‌ను సాధారణంగా ఒకే సమయంలో ఒకరికి మించి చెల్లించరు (రూలు 50), కుటుంబ పెన్షనర్ స్వతహాగా ఉద్యోగి అయితేజీతం మరియు పెన్షన్ పై లేదా రెండు పెన్షన్లపై డిఏ చెల్లిస్తారు. కుటుంబ పెన్షనర్ కారుణ్య నియామకం పొందితే ఒక డిఏ మాత్రమే (జిఓ
|51 ఆర్థిక, తేది. 05, 08, 2015) చెల్లించ బడుతుంది. రెండు ఫ్యామిలీ పెన్షన్ల గరిష్ట మొత్తం రూ. 27,830/-కి మించి చెల్లించరు.
పెన్షను దరఖాస్తు : రిటైర్మెంటుకు 18 నెలలు ముందుగానే దరఖాస్తు చేయవచ్చు. జిఓ 263 ఆర్థిక, తేది. 23.11.1998 ద్వారా సులభతరం చేయబడిన ఫార్మల్ అప్లికేషన్, ఎబిసి ఫారాలు, నామినేషన్లు, డిక్లరేషన్లను 4 సెట్లు ఉద్యోగి కార్యాలయాధిపతికి దాఖలు చేస్తే వారే పెన్షన్ మంజూరు చేసి ఎజికి పంపిస్తారు.
ఏంటిసిపేటరీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ : రిటైరయ్యే నాటికి పెన్షన్, గ్రాట్యుటీ విడుదలకాకపోతే, అర్హతగల పెన్షన్లో 90% ఎంటని పేటరీ పెన్షన్‌గా ప్రతి నెలా చెల్లించబడుతుంది అట్లే గ్రాట్యుటీలో 80% చెల్లించబడుతుంది. ఏంటని పేటరీ ఫ్యామిలీ పెన్షన్, పెన్షన్లో 75% వుంటుంది. (రూలు 51)
పెన్షన్ కన్సాలిడేషన్ : 01.07.2013 నాటి బేసిక్ పెన్షన్‌కు 63.344% డిఏ రిలీఫ్ ను, బేసిక్ పెన్షన్లో 43% కలుపగా వచ్చిన మొత్తము (పై రూపాయనకు సవరించి) కన్సాలిడేటెడ్ పెన్షన్‌గా నిర్ణయించబడుతుంది. దీని నుండి కమ్యూటెడ్ పెన్షన్ భాగము మినహాయించబడి మిగిలినది చెల్లించబడుతుంది. జిఓ ఎంఎస్ నం. 51 ఫైనాన్స్, తేది. 08.05.2015
కనీస పెన్షను :
 1. 01.07.2013 నుండి కనీస పెన్షను రూ. 3,350/- నుంచి రూ. 6,500/-గా పెంపుదల చేయబడినది.
 2. ఆర్థిక సహాయం : ప్రస్తుతం చెల్లిస్తున్న ఆర్థిక సహాయం రూ. 3,350/- నుండి రూ. 6,500/-కు పెంపుదల చేశారు. (జిఓ 51 ఫైనాన్స్, తేది 08.05.2015)
వాలంటరీ రిటైర్మెంటు : 20 సం||ల అరదాయక సర్వీసు తర్వాత 3 నెలల ముందు నోటీసునిచ్చి ఉద్యోగి ఐచ్చికంగా రిటైర్ కావచ్చు. ఉన్నత విద్యాభ్యాసనముకు పెట్టిన జీతనష్టపు సెలవు తప్ప, మరే యితర జీత నష్టపు సెలవు అర్హతగల సర్వీసుగా పరిగణించబడదు. 5 సం||మించకుండా సర్వీసు వెయిటేజీ ఇస్తారు. వాలంటరీ రిటైర్మెంటుకు కూడా పెన్షన్ కమ్యుటేషన్ తో సహా అన్ని సౌకర్యాలున్నాయి. (రూలు43).
బ్యాంకుల ద్వారా పెన్షను చెల్లింపు : దాదాపు అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ద్వారా పెన్షన్ చెల్లించబడే సౌకర్యం 01.11.1985 నుండిఅమలులోనికి వచ్చింది. ఏ బ్యాంకు ద్వారా పెన్షన్ చెల్లింపు కోరేది పెన్షన్ దరఖాస్తులో పేర్కొనాలి. ట్రెజరీ ద్వారా ప్రస్తుతం పెన్షన్తీ సుకుంటున్న వారు కూడా బ్యాంకు నుండే పెన్షన్ పొందే విధానం ప్రవేశపెట్టబడినది.
నోట్ : ఉద్యోగి చనిపోయినప్పుడు : ఉద్యోగి రోజులో ఏ సమయంలో చనిపోయినా ఆ రోజు డ్యూటీలో ఉన్నట్లుగానే పరిగణిస్తారు. ఇంక్రిమెంటు తేది అయితే ఇంక్రిమెంటు కూడా మంజూరు చేస్తారు.
పెన్షన్ కమ్యూటేషన్ : పెన్షన్లో 40%కు మించకుండా (పూర్తి రూపాయలలో) కమ్యుటేషన్చే సుకొనవచ్చును. మొత్తాన్ని పై రూపాయనకు సవరించాలి. దరఖాస్తు చేరిన తేదీన (నాన్ మెడికల్) లేదా వైద్య పరీక్ష తేదీన అమలులో వున్న కమ్యుటేషన్ విలువలు వర్తిస్తాయి. కమ్యుటేషన్ మొత్తం తీసుకొన్న
తేదీ నుండి పెన్షనులో తగ్గింపు ప్రారంభమవుతుంది. కమ్యూట్ చేసిన పెన్షన్ భాగానికి కూడా డిఏ లెక్కిస్తారు. పెన్షన్ ఫారాలలోనే కమ్యుటేషన్ వివరాలు పూరించాలి.
కమ్యుటేషన్ సూత్రము : కమ్యుటేషన్ చేయదలచిన పెన్షన్ X 12 x కమ్యుటేషన్ విలువ = కమ్యుటేషన్ మొత్తము.
వైద్య పరీక్ష : పెన్షన్ మంజూరు కాకపోయినా, రిటైరైన ఏడాదిలోపు కమ్యుటేషన్ దరఖాస్తును కార్యాలయాధిపతికి సమర్పిస్తే వైద్య పరీక్ష అవసరం లేదు. ఏడాది దాటి దరఖాస్తు చేస్తే కమ్యుటేషన్ మొత్తం రూ. 15,000/-లో పైతే జిల్లా వైద్యాధికారి నుండి, అంతకు పైనైతే మెడికల్ బోర్డు నుండి ధృవపత్రమును పొందాలి.
కమ్యూట్ చేసిన పెన్షన్ తిరిగి చెల్లింపు :  రిటైర్మెంటుతోపాటే కమ్యుటేషన్ జరిగితే రిటైర్మెంటు తేదీ నుండి 15 సం|| పూర్తయినప్పటి నుండి కమ్యూటేషన్ విడిగా జరిగితే కమ్యూటేషన్ అమలయ్యే తేదీ నుండి 15 సం||లు నిండినప్పటి నుండి కమ్యూటెడ్ పెన్షన్ భాగం తిరిగి చెల్లించబడుతుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND