Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

AP LEAVE RULES | AP Employee Service Rules. ‌

ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules)

AP లీవ్ రూల్స్ 1933 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించబడుతున్న కొన్ని ముఖ్య సెలవులు.
ప్రసూతి సెలవులు: మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చే నిమిత్తం 2010లో మంజూరు చేసిన జిఓ నెంబర్ 152 ప్రకారం 180 రోజుల సెలవులు డెలివరీ సమయంలో వాడుకోవచ్చు.
ఈసెలవులు వేతనంతో కూడుకున్నవి.
క్యాజువల్ సెలవులు: ఉద్యోగులకు సంవత్సరానికి 15 రోజులు సాధరాణ సెలవులు మంజూరు చేస్తారు. 1981లో జీఓ నెంబర్ 52 మంజూరుచేసింది.
ఐచ్చికసెలవులు: ప్రభుత్వ ఉద్యోగులకు క్యాలెండర్ ఇయర్కు ఐదురోజులు ఐశ్చిక సెలవులు మంజూరు చేస్తారు. అయితే క్యాలెండర్లో పేర్కొన్న పండుగలలో మాత్రమే ఈసెలవులు ఉపయోగించుకునే వీలుంటుంది. ఇవికూడా వేతనంతో కూడుకున్నవే.
అర్థవేతన సెలవులు: అర్ధ వేతన సెలవులు కింద ప్రభుత్వం 1994లో మంజూరుచేసిన 317 జీఓ కింద ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి 20 అర్ధ వేతనపు సెలవులు మంజూరుచేస్తారు. వీటిని వాడు కున్న ఉద్యోగులకు ఆయా రోజులలో సగం వేతనం చెల్లిస్తారు.
పితృత్వ సెలవులు: 2015లో ప్రభుత్వం మంజూరు చేసిన 231 జీఓ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు కింద 15 రోజులు మంజూరు చేశారు. ప్రసవం పొందిన భార్యకు సేవలందించేందుకు భర్తకు ఈసెలవులు ఇస్తారు.
సంపాదిత సెలవులు(ఎర్న్డ లీవ్స్): క్యాలెండర్ ఇయర్కుగాను 30 సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు. ఈసెలవులు వాడుకోగా మిగిలిన వాటిని అదే ఏడాది అమ్ముకోవచ్చు. అంటే ఆమొత్తానికి సమానమైన వేతనాన్ని పొందవచ్చు. 1994లో ప్రభుత్వం 317 జీఓను మంజూరుచేసింది.
కుటుంబ నియంత్రణ సెలవులు: కుటుంబ నియంత్రణ చేసుకున్న పురుష ఉద్యోగులకు ప్రభుత్వం ఆరు రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తారు. మహిళా ఉద్యోగులకు మాత్రం 14 రోజులు మంజూరుచేస్తారు. వీటిని మంజూరుచేస్తూ 1968లో జీఓ నెంబర్ 1415ను విడుదలచేసింది.
అబార్షన్ సెలవులు: అబార్షన్ సెలవులు కింద ప్రభుత్వం 1976లో జీఓ నెంబర్ 762ను విడుదల చేసింది. దీనిప్రకారం అబార్షన్ సెలవులు కింద మహిళా ఉద్యోగులు 42 రోజులు సెలువులు ప్రభుత్వం మంజూరుచేస్తుంది.
చైల్డ్ కేర్ లీవ్: ప్రభుత్వం చైల్డ్ కేర్ లీవ్ కింద 2016లో జీఓ నెంబర్ 209 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు 90 రోజులు సెలవులు మంజూరుచేస్తుంది.
రీకానలైజేషన్ సెలవులు: 1981లో జీఓ నెంబర్ 102 ప్రకారం రీకానలైజేషన్ కింద 21 రోజుల సెలవులు మంజూరు చేస్తారు.
రక్తదాన సెలవు: ఉద్యోగులకు రక్తదాన సెలవు కింద ఒక్కరోజు మంజూరు చేస్తారు. 1984లో జీఓ నెంబర్ 137ను ప్రభుత్వం జారీచేసింది.
యూనియన్ లీడర్స్ స్పెషల్ సెలవులు: ప్రభుత్వరంగ సంస్థలలో యూనియన్ నాయకులుగా పనిచేస్తున్న ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ కింద 21 రోజులు మంజారుచేస్తూ 1994లో జీఓ నెంబర్ 470 విడుదల చేసింది.*
హిస్టరెక్టమి సెలవులు: 2011లో హిస్టరెసక్టమి సెలవులు 45 రోజులు మంజూరుచేస్తూ జీఓ నెంబర్ 52ను విడుదల చేసింది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND