Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జనన ధ్రువీకరణ పత్రంగా ఆధార్‌: EPFO

జనన ధ్రువీకరణ పత్రంగా ఆధార్‌: EPFO

దిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తమ ఖాతాదారులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ఖాతాదారులకు పుట్టిన తేదీ మార్పు కోసం ఆధార్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కార్మిక శాఖ అన్ని పీఎఫ్‌ కార్యాలయాలకు సూచనలు జారీ చేసింది. దీంతో పీఎఫ్‌ ఖాతాదారులు తమ ఈపీఎఫ్‌ రికార్డుల్లో పుట్టిన తేదీని మార్చుకునే వీలు కలుగుతుంది. పీఎఫ్‌ వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఈ మేరకు సవరణ అభ్యర్థనలు పెట్టుకోవచ్చు. అయితే, పుట్టిన తేదీ విషయంలో మూడేళ్ల వరకు వ్యత్యాసాన్ని మాత్రమే అనుమతిస్తారు. నగదు ఉపసంహరణకు సంబంధించి పీఎఫ్‌ ఖాతాదారులు ఆన్‌లైన్‌లో పెట్టుకున్న అభ్యర్థనలను వేగంగా పూర్తి చేయాలనీ ఈపీఎఫ్‌వో పీఎఫ్‌ కార్యాలయాలకు సూచించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పీఎఫ్‌ వినియోగదారులు తమ ఆర్థిక అవసరాల కోసం మూడు నెలల వేతనాన్ని తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించిన సంగతి తెలిసిందే. కేవైసీ పూర్తికాని వినియోగదారులకు తాజా నిర్ణయంతో ఊరట కలగనుంది.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND