Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

జీతాలు చెల్లింపు విధానంలో రానున్న మార్పులు

జీతాలు చెల్లింపు విధానంలో రానున్న మార్పులు
CFMS స్థానంలో HUMAN CAPITAL MANAGEMENT- (హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అమలు)
➧రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలందించే విధానాన్ని మార్పు చేసింది .ఈ మార్పులను అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు అమలు చేసేందుకు నిర్ణయిం చింది.ఈ విధానాన్ని దశలవారీగా అమలు జరుపుతారు
➧సీఎస్ఎంఎస్ రెండో దశను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది . మొదటి దశలో ఉన్న పొర పాట్లు , ఇతర ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టింది .
➧" హ్యూమన్ క్యాపిటల్ మేనేజిమెంట్ ( హెచ్ సీఎం ) విధానాన్ని అన్ని ట్రెజరీ కార్యాలయాల్లో అమలు చేసేందుకు సదుపాయాలను సమకూర్చింది .
➧ ఆర్ధిక శాఖ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బీమా ( ఏపీజీఎల్ ) స్టేట్ ఆడిట్ , పే అండ్ అకౌంట్స్ విభాగాలలో ఈనెల నుంచే ఈ విధానంలో జీతాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
➧మిగిలిన శాఖల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో .. అంటే మార్చి తర్వాత అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ట్రెజరీ కార్యాలయాలల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ విధానంలో జీతాలు అందించాక మిగిలిన ఇతర శాఖ లకు విస్తరిస్తారు
➧ఉద్యోగుల సేవా పుస్తకాలను కంప్యూటరీకరించడం వల్ల అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్ సైట్లో కూడా ఉంటాయి
➧ప్రతినెలా వారికి రావాల్సిన పరిహా రాలు ఆటోమెటిక్ గా జనరేట్ అవుతుంటాయి .
➧తయారుచేసిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా వారికి సంబంధించిన సమస్త ఆర్థిక వ్యవహరాలు అంటే ఇంక్రిమెంట్లు , ఎన్ క్యాష్ మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకా నెల నమోదవుతుంటాయి
➧ ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించిన ట్రెజరీ ఐడీ ఈ ఎస్ఆర్‌కు అనుసంధానం చేయడం వల్ల ఈ నంబర్ ఆధారంగా నెలవారి జీతం అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే జీతం , డీఏ , హెల్తప్ , ఇతర కటింగ్లన్నీ కలిపి నిఖరఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా కార్యకలాపాలు జరుగుతాయి.
➧తమకు ఇంక్రిమెంట్లు కావాలి , తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే పరిస్థితి ఉండదు . ప్రభుత్వం కరువు భత్యం పెంచిన తక్షణమే ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలలో జమ అవుతుంది .
➧ఇంతవరకు ట్రెజరీ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లను , ఏటీవోలను , ఇతర సిబ్బందిని ప్రసన్నం చేసుకునేందుకు ఉద్యోగులు నానాపాట్లు పడేవారు . ఇకపై ఆ పరిస్థితి ఉండదు .
➧ అధికారులకు లంచాలు అందించే ప్రక్రియకు ఏమాత్రం అవకాశం ఉండదు . అదనపు ఎరియర్లు వచ్చినా ట్రెజరీ సిబ్బం దితో సంబంధం లేకుండా నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతా లలో జమ అవుతుంటాయి .
➧ హెచ్ సీఎంలో ఎవరి ప్రమేయం లేకుండా ఉద్యోగులకు రావా ల్సిన ప్రయోజనాలన్నీ ఆటోమెటిగా నమోదవుతాయి 
➧ఉద్యోగుల జీతాల వ్యవహారంలో అవినీతి అక్రమాలకు తావులేకుండా నీతివంతమైన విధానం అమల్లోకి వస్తుంది .
➧ ఈ ఎస్ఆర్ లో నమోదు చేసిన వివరాల మేరకు అన్ని కార్యక్ర మాలు పారదర్శకంగా అమలు జరిగే పరిస్థితి నెలకొంటుంది.
జీతాల చెల్లింపులో వెసులుబాటు
➧ఆర్ధిక శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల ఉద్యోగులు , ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో ఎంతో వెసు ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు
➧గతంలో మాదిరిగా ఉద్యోగులు ఇబ్బందిపడే పరిస్థి తి ఉండదు . అన్ని మండలాల ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగులు , ఉపాధ్యాయులకు ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్లు అందుబాటులోకి వస్తే ఈ విధానం పని తీరు సులభతరమవుతుంది.
➧రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఉద్యోగుల జీతాల కోసం ప్రవే శపెడుతున్న హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్ మెంటు విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
➧జీతాలను అందించడానికి ఉన్నత పాఠశాలల్లో గజిటెడ్ హెచ్ఎం డీడీవోగా వ్యవహరిస్తు న్నారు . ఈ విధానం అమల్లోకి వస్తే ఈ డీడీవోల ప్రమేయం లేకుండానే జీతాలు అందుతాయని పలువురు ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
➧ప్రస్తుతం మూడు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాత్రమే ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు . అన్ని శాఖలకు కూడా తక్షణం అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND