డిగ్రీలో కామన్ ఫీజు--కసరత్తు చేస్తున్న ఉన్నత విద్య కమిషన్
డిగ్రీ కోర్సుల్లో ఉమ్మడి (కామన్) ఫీజు విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎపి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఎపిహెచ్ ఈఆర్ఎంసి) భావిస్తోంది. ఇప్పటివరకు ఫీజులను విశ్వవిద్యాలయాలు వాటికి అనుబంధంగా ఉన్న డిగ్రీ కళాశాలకు ఫీజులను నిర్ణయించేవి. ఈసారి అన్ని కళాశాలలకు ఉమ్మడి ఫీజును ప్రవేశపెట్టాలని ఎపి హెచ్ ఈఆర్ఎంసి ఆలోచిస్తోంది.
➧ రాష్ట్రంలో 1,438 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 1153 ప్రైవేట్, 132 ఎయిడెడ్, 152 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. కళాశాలల సమాచారాన్ని ఎపి హెచ్ ఈఆర్ఎంసికి కళాశాలలు ఇప్పటికే అందజేశాయి.
➧ ఫీజులను నిర్ణయించేందుకు 22 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ఇప్పటికే కొన్ని అంశాలను పరిశీలించింది. మూడేళ్లుగా కళాశాల సాధించిన ఫలితాలు, అవార్డులు, సొంత భవనాలు వంటి వాటిని ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది.
➧ పదేళ్లు దాటిన ప్రైవేట్ కళాశాలలు కచ్చితంగా సొంత భవనంలోకి మారాలనే నిబంధన ఉన్నా, సుమారు 70శాతం సొంత భవనాల్లో నడవడం లేదు. ఫీజులను నిర్ధారించే సమయంలో ఈ అంశాన్ని ప్రధానంగా చూడాలని భావిస్తోంది.
➧కామన్ ఫీజు కాకుండా గ్రేడ్ ప్రకారం కూడా ఫీజులను నిర్ణయిస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన కూడా చేస్తోంది. కొన్ని కళాశాలలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి నడుస్తున్నాయని, విద్యార్థులు లేకుండా కళాశాలలను నడిపిస్తున్నట్లు కమిషన్ దృష్టికొచ్చింది. గ్రేడ్ విధానం ప్రవేశపెడితే ఇలాంటి వాటికి చెక్ చెప్పవచ్చునని భావిస్తోంది.
➧ప్రతి జిల్లాలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నడుస్తున్న రెండు కళాశాలలను పరిశీలించి వాటి నిర్వహణకు అవుతున్న ఖర్చులను బట్టి ఫీజును నిర్ణయించాలని చూస్తోంది.
➧ జూలో డిగ్రీ కళాశాలల ఫీజులను నిర్ణయించేందుకు కమిషన్ ప్రణాళిక రూపొందిస్తోంది.

No comments:
Post a Comment