బస్టాండ్లలో పెట్రోల్ బంక్‌లు --పెట్రోలియం సంస్థలతో ఆర్టీసీ చర్చలు
రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్లు, డిపోల ఆవరణలో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ భావిస్తోంది. జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో మొత్తం 90 చోట్ల వీటిని ఏర్పాటు చేసేందుకు గుర్తించారు. వీటిని సొంతంగా నిర్వహించాలా? పెట్రోలియం సంస్థలకు స్థలం లీజుకు ఇచ్చి అద్దె తీసుకోవాలా? అనేది ఆలోచిస్తున్నారు. పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో రెండు, మూడు రోజులుగా చర్చలు జరుపుతున్నారు.
సంచార వైద్య వాహనాలుగా ఏసీ బస్సులు
ఆర్టీసీలో ఉన్న 267 ఏసీ బస్సులను సంచార వైద్య వాహనాలుగా ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వీటిని నడపటం లేదు. వైద్యశాఖ సిబ్బంది గ్రామాలకు వెళ్లి కరోనా పరీక్షలకు నమూనాలు సేకరించేందుకు ఈ బస్సులను వినియోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ, వైద్య ఆరోగ్యశాఖను కోరారు. అద్దెపై చర్చించి నిర్ణయిస్తామంటూ ఆ శాఖకు ప్రతిపాదన పంపారు.
6 వేల లీటర్ల శానిటైజర్ కావాలి
ప్రస్తుతం ఆర్టీసీ నిత్యం సగటున 2 వేల బస్సులు నడుపుతుండగా లక్ష మంది ప్రయాణిస్తున్నారు. ప్రతి ప్రయాణికుడి చేతిలో 2 ఎంఎల్ శానిటైజర్ వేస్తున్నామని, నిత్యం 200 లీటర్లు చొప్పున నెలకు 6వేల లీటర్లు అవసరమవుతోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 400 బస్టాండ్లు, 128 డిపోలకు ఒక్కో థర్మల్ స్కానర్ చొప్పున 528 అవసరమని లెక్క తేల్చారు. వీటిని సమకూర్చాలంటూ ఆర్టీసీ ఎండీ, వైద్య ఆరోగ్యశాఖను కోరారు.

No comments:
Post a Comment