గదికి ‘పది’ మందే టెన్త్ పరీక్షలపై సర్కారు నిర్ణయం
♦పరీక్షా కేంద్రాల సంఖ్య 4,154కి పెంపు
♦అందుబాటులో శానిటైజర్లు, మాస్క్‌లు
♦కొవిడ్-19 నిబంధనల మేరకు ఏర్పాట్లు
♦మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి
కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో గదికి 10 లేదా 12 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. గతంలో గుర్తించిన 2,882 సెంటర్లను 44ు మేరకు పెంచి 4,154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం విజయవాడలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో పరీక్షల ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో ప్రతి గదిలోనూ శానిటైజర్లు, మాస్క్‌లు అందుబాటులో ఉంటాయని, సిబ్బంది, విద్యార్థుల కోసం 8 లక్షల మాస్క్‌లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించడంతో పాటు.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌లు ధరించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.
పరీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయులకు గ్లౌజులు కూడా ఇస్తారని పేర్కొన్నారు. ప్రతి కేంద్రంలో ఒక థర్మల్ స్కానర్ ఉండేలా మొత్తం మీద 4500 స్కానర్లు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. కట్టడి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదన్నారు. ఒకవేళ ఇప్పుడున్న కేంద్రాల వద్ద కొత్తగా కరోనా కేసులు వచ్చి వాటిని కట్టడి ప్రాంతాలుగా ప్రకటిస్తే.. అలాంటి చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ విద్యార్థులకు ఒక రోజు ముందు నుంచే హాస్టల్ వసతి కల్పింస్తామని, పరీక్షలు జరిగినన్ని రోజులు వారు వసతి గృహాల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఓపెన్ స్కూలు పరీక్షలు కూడా ఇదే తరహాలో నిర్వహిస్తామని తెలిపారు. ఓపెన్ పరీక్షలకు 1022 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

No comments:
Post a Comment