అంగన్‌వాడీల్లోనూ నాడు-నేడు కార్యక్రమం
అంగన్‌వాడీలన్నీ ప్రీస్కూల్ తరహా విధానంలోకి రావాలని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహిళా శిశుసంక్షేమశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. అంగన్‌వాడీల్లో కూడా నాడు-నేడు కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల తరహాలో అంగన్‌వాడీల్లో అభివృద్ధి, సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. ‘‘దాదాపు 24వేల అంగన్‌వాడీ భవనాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. భవనాలు లేని చోట 31 వేల అంగన్‌వాడీల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలి. అంగన్‌వాడీల్లో గర్భిణీలు, తల్లులు, పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యంగా ఉండాలి’’అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

No comments:
Post a Comment