Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

గ్రామ-వార్డు-సచివాలయాలు - అందులో అందించే సర్వీసులు

గ్రామ-వార్డు సచివాలయాలు - అందులో అందించే సర్వీసులు
➧క్యాస్ట్ సర్టిఫికెట్ - 15 రూపాయలు
➧ OBC సర్టిఫికెట్ - 15 రూపాయలు
➧EWS సర్టిఫికెట్ - 15 రూపాయలు.
చాలా సర్వీసెస్ కేవలం 15 రూపాయలు మాత్రమే .కొన్నింటికి వేరు వేరు ఛార్జ్ ఉంటుంది.)
సచివాలయాల్లో ఏమేమి సర్వీసులు అందిస్తారు.
సచివాలయంలో 2 రకాల  సర్వీసెస్ అందిస్తారు.
1. మీసేవ సర్వీసెస్
2. నాన్ మీసేవ సర్వీసెస్..
మీసేవ సర్వీసెస్ లో భాగంగా ఏమేమి సర్వీసులు అందిస్తారు , సర్వీసుకు ఎంత అమౌంట్ చార్జ్ అవుతుంది.
➧ ఆధార్ :  ekyc చేస్తారు - 15 రూ
➧  CDMA ( మున్సిపల్ సర్వీసెస్  ):  చైల్డ్ బర్త్ సర్టిఫికెట్ , బర్త్ సర్టిఫికెట్ లో పిల్లల పేర్లు చేర్చడం (చైల్డ్ name inclusion) , Corrections in Birth and death certificate , Non availability birth and death certificates . (  65 రూపాయలు)
➧ వికలాంగులకు :సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్ , సర్టిఫికెట్ ప్రింట్ చేయడం.
➧ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ : Encumbrance Certificate (E.C), Certified copy of Registration document .
➧ Social welfare : ఫ్రెష్ , రెన్యువల్ Scholar ship apply , జ్ఞాన భూమి స్టూడెంట్ బయోమెట్రిక్ తీసుకోవడం.
➧ రైతులకు :  1బి , computerised అదంగల్  సర్టిఫికెట్లు , అగ్రికల్చర్ income  సర్టిఫికెట్  ( 15 రూపాయలు) ..
➧  రెవిన్యూ సర్వీసెస్ :ఇన్కమ్ సర్టిఫికెట్ , కుల ధ్రువీకరణ పత్రం(caste సర్టిఫికెట్) ,  ఓబీసీ సర్టిఫికెట్ , EWS సర్టిఫికెట్ , Family member certificate , Local candidate certificate ( 15 రూపాయలు)
ఇంకా చాలా రకాల సర్వీసులు ఉంటాయి.
Non Mee seva Services

➤ కొత్త రేషన్ కార్డ్ అప్లై , రేషన్ లో మెంబెర్ యాడ్ చేయడం.
➤ రైతు భరోసా కి అప్లై చేయడం , అమౌంట్ పడిందో లేదో స్టేటస్ చెక్ చేయడం
➤ నిరుద్యోగులకు:  స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్APSSDC లో నమోదు చేసుకోవచ్చు.
➤ APSRTC : స్టూడెంట్స్ కి బస్ పాస్ అప్లై చేయడం , టికెట్ రిజర్వేషన్లు చేసుకోవచ్చు.
➤YSR  పెళ్లి కానుక సర్టిఫికెట్ డౌన్లోడ్ , అప్లికేషన్ స్టేటస్ చూడవచ్చు.
➤ ప్రజా సాధికారక సర్వే స్థితి తెలుసుకోవచ్చు.
➤ రవాణా :  లెర్నింగ్ లైసెన్స్ LLR  కి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రెస్ మార్పు , Renual సర్వీసెస్ ఉన్నాయి.
మొత్తం 540 సర్వీసెస్ చేస్తారు
 మీరు ఉన్నది గ్రామ సచివాలయం పరిధిలో అయితే డిజిటల్ అసిస్టెంట్ గారిని , మున్సిపాలిటీ లో అయితే వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారిని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు.
GOVERNMENT OF ANDRAPRADESH
--------------------------------------------------
           గ్రామ వార్డు సచివాలయంలో 544 సర్వీసులు మీసేవ అదేవిధంగా మీ సేవ నుండి కాక నాన్ మీ సేవ సర్వీసులు అందుబాటులోకి రావడం జరిగింది.
 మీసేవ సర్వీసులు ఎక్కువగా ఉపయోగించేవి.
1. కరెంట్ బిల్
2. క్యాస్ట్ సర్టిఫికెట్
3.ఇన్కమ్ సర్టిఫికెట్ (వైట్ రేషన్ కార్డు ఉంటే అవసరం లేదు దానిని ఇన్కమ్ సర్టిఫికెట్ గా తీసుకుంటారు)
3.  మ్యుటేషన్ టైటిల్ డిడ్ కం పట్టాదార్ పాస్ బుక్.
4.  1బి సర్టిఫికెట్
5. అడంగల్ సర్టిఫికెట్
6. ఫ్యామిలీ మెంబర్ షిప్ సర్టిఫికెట్.
7. ఈ పట్టాదార్ పాస్ బుక్.
8. ఈ డబ్ల్యూ ఎస్ (ఎకనామికల్లి వీకర్ సెక్షన్ సర్టిఫికెట్)
9. ఆధార్ ఈ కేవైసీ
10. రేషన్ కార్డ్ మెంబర్ హౌస్ హోల్డ్ హెడ్ మోడిఫికేషన్
11. సదరమ్ స్లాట్ బుకింగ్ (స్లాట్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ప్రతి 1వ తేదీ ఉదయం  8 నుండి 10 గంటల లోపు) కొన్నిసార్లు స్లాట్స్ ఎవైలబిలిటీ పి బట్టి మారవచ్చు.
12. సదరమ్ సర్టిఫికెట్ ప్రింట్
13. అధర్ బ్యాక్వర్డ్ క్లాస్ (ఓబీసి) సర్టిఫికెట్
14. లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్
15. కరెక్షన్స్ ఇన్ అడంగల్
16. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్(ఈసీ)
17.APSRTC టికెట్స్ బుకింగ్.
18.AP RTA సర్వీసులు అనగా
డ్రైవింగ్ లైసెన్స్
వెహికల్ బ్రేక్ అనగా ఫిట్నెస్ సర్టిఫికెట్
వాహనాల రిజిస్ట్రేషన్లు మార్పు
క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మరియు ఇయర్లీ టాక్స్ లు
మొదలైన సర్వీసులు మన గ్రామ సచివాలయం లో మినిమమ్ ఛార్జ్ తో అందిస్తున్నాము.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND