ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ!
➧ఏడాది పాటు పూర్వ ప్రాథమిక విద్యాబోధన
➧ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు సన్నాహాలు
➧ఆన్‌లైన్ బోధనకు 24 గంటల పాటు పనిచేసే టీవీ చానెల్
➧ఏడాదికి విద్యార్థికి పది మాస్కులు, 6 శానిటైజర్ బాటిళ్లు
➧కేంద్రానికి నివేదించిన సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు
➽రాష్ట్రవ్యాప్తంగా 3,400 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి సమగ్ర శిక్ష అభియాన్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
➽ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచే పనిలో ఉంది. అమ్మఒడి నగదు సాయం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం, ఇంగ్లిష్ మీడియం ప్రవేశం తదితర వాటితో సర్కారీ పాఠశాలలను బలోపేతం చేస్తోంది.
➽తాజాగా పూర్వ ప్రాథమిక విద్యను ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది. వీరికి బోధనకుగాను కొంతమంది నిరుద్యోగ యువతను కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియమించనున్నట్లు తెలుస్తోంది
సరికొత్తగా ముందుకు..
➤విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాల బోధనకు ప్రత్యేక టీవీ చానల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర శిక్ష అభియాన్ యోచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలల తరబడి పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు బోధనకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ బోధన చేస్తున్నాయి. ప్రభుత్వ విద్యకు సంబంధించి అటువంటి పరిస్థితి లేదు. కొందరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ధ చూపిస్తున్నా మార్గం లేదు. ➤ఈ పరిస్థితుల్లో టీవీ ద్వారా ఆన్‌లైన్ బోధన అందుబాటులోకి తెస్తే ఎంతో ప్రయోజనమని సమగ్రశిక్ష అభియాన్ రాష్ట్రస్థాయి అధికారులు యోచిస్తున్నారు.
➤ టీవీ చానల్ ఏర్పాటుకు రూ.3కోట్లు, నిర్వహణకు ఏటా రూ.40 లక్షలు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.
➤కరోనా నివారణ జాగ్రత్తల్లో భాగంగా విద్యార్థులకు ఏడాదికి పది మాస్కులు, ఆరు శానిటైజర్ బాటిళ్లు అవసరమని గుర్తించారు. తరగతి గదులు శుభ్రం చేయడానికి ప్రత్యేక నిధులు పాఠశాలలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.
➤ తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు అదనంగా యూనిఫారం అందించాలని సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లో స్పష్టమైన ఆదేశాలు రానున్నట్టు అధికారులు చెబుతున్నారు.

No comments:
Post a Comment