మాధ్యమం అనేది విధానపరమైన నిర్ణయం
➧ఇంగ్లిష్ మీడియం రద్దు తీర్పు సుప్రీంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్
➧ఇంగ్లీష్ మీడియం కావాలని తల్లిదండ్రులంతా కోరుతున్నారు
➧హైకోర్టు తీర్పును రద్దు చేయాలి
ఏపీలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ విన్నపం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ తెచ్చిన జీవో 85ను హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహా పూజ ఏ.నజ్కీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్లో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
మాధ్యమం అనేది విద్యా శాఖ గానీ, రాష్ట్రాలు గానీ తీసుకునే విధానపరమైన నిర్ణయం. 'భాషకు సంబంధించిన విధానాన్ని ఎలా మెరుగ్గా అమలు చేయాలో రాష్ట్రానికి తెలుసు. ఇది కోర్టు జోక్యం చేసుకునే అంశం కాదు' అని ఇంగ్లీష్ మీడియం స్టూడెం ట్స్ పేరెంట్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఎక్కువ శాతం తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారు.
ఇంగ్లీష్ భాష జీవనోపాధి ఇచ్చే భాషగా మారింది. చిన్న వయసు లోనే ఇంగ్లీష్ ని పరిచయం చేయడం ద్వారా ఆ భాషను సులు వుగా ఆకళింపు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు, పేద పిల్లలు, నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు ఇంగ్లీష్ మీడీ యం స్కూళ్లు లేక తెలుగు మీడియంలోనే చదువుకుంటున్నారు.
నిరుపేదలు మగ పిల్లలను ప్రైవేటులో ఇంగ్లీష్ మీడియంలో చది విస్తున్నారని, ఆడపిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నా రని, ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బోధిస్తే విద్యావకాశాల్లో లింగ సమానత్వం తేవొచ్చు.
తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచడంతోపాటు అన్ని స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. తెలుగు మీడియంలో చదవాలనుకునే విద్యా రులకు ప్రతి మండలంలో ఒక పాఠశాల ఉంటుంది. ఈ దృష్ట్యా కోర్టు వెలువరించిన తీర్పు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.

No comments:
Post a Comment