Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టండి.

స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టండి.
➧విద్యార్థులు రావాల్సిన పనిలేదు
➧తల్లిదండ్రుల సమ్మతుంటే చాలు
➧9వ తరగతి వరకు అంతా ప్రమోట్
➧వలస కూలీల పిల్లలకు టీసీ అక్కర్లేదు
➧పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
➤ప్రాథమిక, ప్రాథమి కోన్నత, ఉన్నత పాఠశాలల్లో కొత్త అడ్మిషన్ల ప్రక్రియను మండల విద్యాశాఖాధికారులు (ఎంఈఓ), ఉప విద్యాశాఖాధికారులు (డీవైఈఓ) పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలన్నారు.
➤ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు (ఆర్జేడీ) కమిషనర్ సర్క్యులర్లు జారీ చేశారు.
➤ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు అంతా పాస్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించిందని, ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ప్రమోషన్ జాబితాలను రూపొందించాలన్నారు.
➤ తదుపరి తరగతిలో వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు.
➤ ఇక ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన విద్యార్థులను యూపీ లేదా హైస్కూళ్లలో చేర్చేందుకు   తల్లిదండ్రుల సమ్మతి తీసుకుంటే సరిపోతుందన్నారు.
➤ఆరు, ఎనిమిది తరగతులలో చేరేందుకు విద్యార్థులు స్కూళ్లకు రావాల్సిన అవసరం లేదని, వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకుంటే సరిపోతుందన్నారు.
➤వారు ఏ స్కూల్ లో చేరాలను కుంటున్నారో ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం)తెలుసుకుని, ఆ వివరాలను సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు తెలపాలన్నారు.
➤ప్రక్రియను ప్రాథమిక స్కూళ్లలో ఎంఈఓ, హైస్కూళ్లలో డీవైఈఓ పర్యవేక్షించాలన్నారు.
➤ వలస కూలీల పిల్లలకు ఎలాంటి పత్రాలు లేకున్నా అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించారు.
➤ వారి నుంచి ఎలాంటి టీసీలను అడగవద్దన్నారు.
➤ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం హెచ్ఎంలు టీసీ, స్టడీ సర్టిఫికెట్లను అడగవద్దని స్పష్టం చేశారు.
➤ఆదర్శ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాల యాలలో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.
➤కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీలు ఉన్న ఏడు, ఎనిమిది తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర డైరెక్టర్ కూడా అయిన చినవీరభద్రుడు తెలిపారు.
➤ఈ నెల 20 నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కేజీబీవీలలో టెన్త్ చదివిన వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND