Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

SBI FD: ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్... ఆన్‌లైన్‌లో చేయండి ఇలా

SBI FD: ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్... ఆన్‌లైన్‌లో చేయండి ఇలా
➤బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఆన్‌లైన్‌లో ఎఫ్‌డీ ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తోంది. చాలా సింపుల్‌గా ఎఫ్‌డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
➤ఎస్‌బీఐలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఎఫ్‌డీ చేయొచ్చు. ప్రస్తుతం ఎస్‌బీఐ వార్షికంగా 2.9 శాతం నుంచి 5.4 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. వృద్ధులకు 3.4 శాతం నుంచి 6.2 శాతం వడ్డీ ఇస్తోంది.
➤ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు ఆన్‌లైన్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనే రెన్యువల్ చేయొచ్చు. క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ విషయంలో బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఆన్‌లైన్‌లో ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి
➧SBI online FD: ఎస్‌బీఐ ఆన్‌లైన్ ఎఫ్‌డీ ఓపెన్ చేయండి ఇలా
➧ముందుగా https://www.onlinesbi.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
➧లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో Deposit Schemes ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
➧ఆ తర్వాత e-fixed deposit ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
➧మీకు కావాల్సిన ఫిక్స్‌డ్ డిపాజిట్ ఎంచుకోండి.
➧ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించిన నియమనిబంధనలు, వడ్డీ రేట్లు తెలుసుకోండి.
➧ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయండి.
➧మీకు ఒకవేళ వేర్వేరు ఎస్‌బీఐ అకౌంట్స్ ఉన్నట్టైతే ఏ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ కావాలో సెలెక్ట్ చేయండి.
➧ఎంత ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారో అమౌంట్ ఎంటర్ చేయండి.
➧ఎన్ని రోజులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయండి.
➧60 ఏళ్లకు పైనే వయస్సు ఉన్నట్టైతే సీనియర్ సిటిజన్స్ ఆప్షన్ క్లిక్ చేయండి.
➧మెచ్యూరిటీ ఇన్‍స్ట్రక్షన్ కూడా సెలెక్ట్ చేయాలి.
➧టర్మ్ అండ్ కండీషన్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.
➧మీ ఎఫ్‌డీ వివరాలన్నీ స్క్రీన్ పైన కనిపిస్తాయి.
➧ట్రాన్సాక్షన్ నెంబర్‌ను రిఫరెన్స్ కోసం నోట్ చేసి పెట్టుకోవాలి.
➧పీడీఎఫ్ కాపీ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND