వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న 12 అద్భుతమైన ఫీచర్లు ఇవే..!
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్లకు నూతన ఫీచర్లను అందిస్తూనే వస్తోంది. ఇప్పటికే అందులో పలు అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలో వాట్సాప్ తన యూజర్లకు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తేనుంది. మొత్తం 12 కొత్త ఫీచర్లను వాట్సాప్ అందివ్వనుంది. వాటిపై ఓ లుక్కేద్దామా..!
1. వాట్సాప్‌లో త్వరలో రూమ్స్ ఫీచర్‌ను అందివ్వనున్నారు. దీని ద్వారా ఒకేసారి 50 మంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. వాట్సాప్ వెబ్ లేదా ఫోన్ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
2. వాట్సాప్‌లో నూతనంగా ప్రైవసీ ఫీచర్లను కూడా త్వరలో అందివ్వనున్నారు. దీని వల్ల యూజర్ల చాట్లకు మరింత ప్రైవసీ ఉంటుంది.
3. ఇప్పటి వరకు వాట్సాప్‌ను కేవలం ఒక్క డివైస్‌లో మాత్రమే వాడుకునేందుకు వీలు కలిగింది. కానీ ఇకపై ఒక వాట్సాప్ అకౌంట్‌ను ఎన్ని డివైస్‌లలో అయినా వాడుకోవచ్చు.
4. వాట్సాప్ లో కొత్తగా 138 ఎమోజీలను ఇవ్వనున్నారు. చెఫ్, ఫార్మర్, పెయింటర్ వంటి ఎమోజీలు అందులో ఉండనున్నాయి.
5. ఇకపై వాట్సాప్‌లో గ్రూప్ చాట్‌లను పర్మినెంట్‌గా మ్యూట్ చేసే స్విచ్‌ను అందివ్వనున్నారు.
6. వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నూతనంగా కాంటాక్ట్‌లను ఫోన్‌లో సేవ్ చేయవచ్చు. చాలా వేగంగా కాంటాక్ట్‌లను సేవ్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.
7. చాట్‌లలో ఉపయోగించుకునేందుకు వీలుగా యానిమేటెడ్ స్టిక్కర్లను అందిస్తారు. దీంతో చాటింగ్ ఎక్స్‌పీరియెన్స్ మరింత బాగుంటుంది.
8. వాట్సాప్‌లో 8 మందితో గ్రూప్ వీడియో కాల్ చేస్తే.. వారిలో ఎవరినైనా ఒకరిని ఫోకస్ చేసే విధంగా ఫీచర్‌ను అందివ్వనున్నారు.
9. ఇప్పటి వరకు కేవలం ఫోన్‌లోని వాట్సాప్ యాప్‌లో మాత్రమే డార్క్ మోడ్ ఉండేది. కానీ ఇకపై వాట్సాప్ వెబ్‌లోనూ ఈ ఫీచర్ లభిస్తుంది.
10. జియో ఫోన్, ఇతర ఫీచర్ ఫోన్లలో వాట్సాప్‌ను వాడేవారు కూడా స్టేటస్ అప్‌డేట్లను పెట్టుకోవచ్చు. అవి కూడా 24 గంటల తరువాత అదృశ్యమైపోతాయి.
11. వాట్సాప్ గ్రూప్‌లలోని వారు వేగంగా, సులభంగా గ్రూప్ వీడియో కాల్స్ చేసుకునే విధంగా ప్రత్యేకంగా ఓ వీడియో ఐకాన్‌ను యాడ్ చేయనున్నారు.
12. కాంటాక్ట్ షార్ట్‌కట్స్, మరింత నాణ్యమైన వాయిస్ కాల్స్, కలర్ చాట్ బబుల్ తదితర ఇతర ఫీచర్లను కూడా త్వరలో వాట్సాప్‌లో అందివ్వనున్నారు. ప్రస్తుతం వీటన్నింటినీ బీటా దశలో పరీక్షిస్తున్నారు.

No comments:
Post a Comment