Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల

అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం_
➧సెప్టెంబర్ 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, మాల్స్ బంద్.
➧దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైళ్లకు అనుమతి.
➧సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి.
➧సెప్టెంబర్ 21 నుంచి క్రీడలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు అనుమతి.
➧కార్యక్రమాలకు 100 మందికి మించి హాజరుకాకూడదని నిబంధన.
➧అంతర్ రాష్ట్ర రవాణాకు అనుమతి.
➧అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు.
చిన్న సభలకు అనుమతి

100 మందికి మించకుండా నిర్వహించుకోవచ్చు

సెప్టెంబరు 30 వరకు విద్యాసంస్థల మూసివేత

అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు

రాష్ట్రాల మధ్య ప్రయాణికులు, సరకు రవాణాపై ఆంక్షల్లేవు

సినిమాహాళ్లు,అంతర్జాతీయ విమానాలుఇప్పుడేకాదు

7 నుంచి మెట్రోరైళ్లకు అనుమతి
 సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రో రైళ్లు నడిపించుకునేందుకు కేంద్రం అనుమతించింది. పట్టణాభివృద్ధి, రైల్వే శాఖలు కేంద్ర హోం శాఖతో సంప్రదించి దశలవారీగా మెట్రో కార్యకలాపాలు ప్రారంభించుకోవాలని సూచించింది. 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు ప్రారంభించుకోవచ్చు. అదేరోజు నుంచి 100 మందికి మించకుండా సామాజిక/ విద్య/ వినోద/ సాంస్కృతిక/ మత/ రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించుకోవడానికి పచ్చజెండా ఊపింది.శనివారం ఈ మేరకు అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లను మూసేయాలని ఆదేశించింది. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నవారు తమ ఉపాధ్యాయుల సలహాల కోసం తల్లిదండ్రుల ముందస్తు అనుమతితో స్వచ్ఛందంగా స్కూళ్లను సందర్శించడానికి వెసులుబాటు కల్పించింది. ఎప్పటిలాగానే ఆన్‌లైన్‌ తరగతులు స్వేచ్ఛగా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. అన్‌లాక్‌-3 నిబంధనల గడువు ఈ నెల 31తో ముగిసిపోతుండటంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా తాజా ఉత్తర్వులు విడుదల చేశారు.

*♦21 నుంచి అనుమతించే కార్యకలాపాలు*
పాఠశాలల మూసివేత ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ బోధన, టెలి కౌన్సిలింగ్‌, ఇతరత్రా కార్యకలాపాల కోసం 50% బోధన, బోధనేతర సిబ్బందిని రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు. ప్రామాణిక వైద్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

*  జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థలు, ఐటీఐలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ శాఖల వద్ద నమోదైన స్వల్పకాల శిక్షణ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించుకోవచ్చు. చిన్న వ్యాపారాల అభివృద్ధికి, వ్యాపారాపేక్షను ప్రోత్సహించడానికి ఏర్పాటైన జాతీయ సంస్థలు శిక్షణ కార్యకలాపాలు మొదలుపెట్టుకోవచ్చు.

* పీహెచ్‌డీ విద్యార్థులు, ప్రయోగశాలల్లో పనులు అవసరమైన సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులు చేస్తున్న పీజీ విద్యార్థుల కోసమే 21 నుంచి ఉన్నత విద్యాసంస్థలు తెరుస్తారు. కేంద్ర హోంశాఖతో సంప్రదించిన తర్వాత, కొవిడ్‌ పరిస్థితులను అంచనా వేసి, ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల్ని గమనించాకే కేంద్ర ఉన్నత విద్యాశాఖ దీనికి అనుమతిస్తుంది.

* పరిమిత సంఖ్యలో సభలకు అనుమతించినా వాటికి హాజరయ్యేవారు భౌతిక దూరం సహా అన్ని నిబంధనల్ని పాటించాలి.

* సెప్టెంబర్‌ 20 వరకు వివాహ కార్యకలాపాల్లో గరిష్ఠంగా 50 మంది, అంత్యక్రియల నిర్వహణలో 20 మంది మాత్రమే పాల్గొనాలి. 21వ తేదీ నుంచి వీటిలో 100 మంది వరకు పాల్గొనవచ్చు.

*♦వీటిపై నిషేధం*
సినిమా హాళ్లు, ఈత కొలనులు, వినోద పార్కులు, థియేటర్లు (ఓపెన్‌ ఎయిర్‌ మినహాయించి) వంటివి

* అంతర్జాతీయ విమాన ప్రయాణాలు (కేంద్ర హోంశాఖ అనుమతించినవి మినహా)

* కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట పైన పేర్కొన్న కార్యకలాపాలు మినహా మిగిలినవన్నీ కొనసాగించుకోవచ్చు.

*♦కంటెయిన్‌మెంట్‌ జోన్లలో 30 వరకు లాక్‌డౌన్‌*
అన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలుచేయాలి. అత్యవసర కార్యకలాపాలు మినహాయించి మిగిలిన వాటిని అక్కడ అనుమతించకూడదు.
రాష్ట్రాల లోపల, వేర్వేరు రాష్ట్రాల మధ్య రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. ప్రయాణికులు, సరకుల రవాణాపై పరిమితులు అమలు చేయకూడదు. వీటికి ప్రత్యేక అనుమతులు, ఈ-పర్మిట్లు అవసరం లేదు. .



No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND