Search

Download Pay Slips/Salary Slips All Districts ZPPF Slips Teacher's Useful Applications Download-Payslips

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు

వాట్సాప్‌ కొత్త ఫీచర్లు: బ్లూ టిక్‌ కొట్టేయండి
లాక్‌ డౌన్‌ కదా.. వాట్సాప్‌ను తెగ వాడుతున్నారనే అనుకుంటున్నాం. ఈ టైమ్‌లోనే వాట్సాప్‌ టీమ్‌ కూడా బిజీగానే ఉంది. యాప్‌లో కొత్త ఆప్షన్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు తెలిసిన సమాచారం చూస్తే... వాట్సాప్‌లో త్వరలో కొత్త ఫీచర్ల రాబోతున్నాయి. ఓసారి వాటికి బ్లూటిక్‌ కొట్టేయండి... అదేనండి చదివేయండి.
బ్యాకప్‌కి రక్షణ
వాట్సాప్‌లో మీ ఛాట్‌ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు ఎన్‌క్రిప్ట్‌ రూపంలో మీ గూగుల్‌ డ్రైవ్‌లో బ్యాకప్‌ అవుతుంటాయి. అయితే దీనికి ఎలాంటి రక్షణ ఉండదు. ఇప్పుడు వాట్సాప్‌ బ్యాకప్‌కి కూడా రక్షణ కల్పించాలని నిర్ణయించుకుంది. బ్యాకప్‌ అయిన డేటాను తిరిగి యాక్సెస్‌ చేయడానికి యూజర్‌ కచ్చితంగా పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్‌వర్డ్‌ను యూజరే క్రియేట్‌ చేసుకోవాలి. దీని వల్ల మీ డేటా ఇతరులు కానీ, ఇతర సంస్థలు కానీ చూసే అవకాశం ఉండదు.
సులభంగా సెర్చ్‌
వాట్సాప్‌లో గ్రూపులు, కాంటాక్ట్స్‌ ఎక్కువైపోయేసరికి పాత ఇమేజ్‌, పీడీఎఫ్‌, లింక్‌ కావాలంటే వెతకడం చాలా కష్టం. అందుకే వాట్సాప్‌ ఓ ఫీచర్‌ను తీసుకురాబోతోంది. మీకు వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలు, డాక్యుమెంట్‌లు, గిఫ్‌లు, ఆడియో మెసేజ్‌లను ఒక చోట ఫైల్‌ మేనేజర్‌లో చూపించబోతోంది. వాటిలో మీకు కావాల్సిన దానిని సెర్చ్‌ ద్వారా కూడా వెతుక్కోవచ్చు. సులభంగా ఉండటానికి ఇందులో ఒక్కోరకం ఫైల్‌కు ఒక్కో రంగు ఇచ్చారు.
గ్రూప్‌ కాల్స్‌ లిమిట్‌
వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ చేసుకోవడం కొత్తేమీ కాదు. గ్రూప్‌ కాలింగ్‌ కూడా అంతే. అయితే గ్రూప్‌ కాలింగ్‌లో గరిష్ఠంగా నలుగురికి మాత్రమే కాల్‌ చేయగలం. త్వరలో ఈ నెంబరు పెరగబోతోందట. ఈ పరిమితిని ఎనిమిది పెంచబోతున్నారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఈ ఫీచర్‌ అందరికీ చాలా ఉపయుక్తంగా ఉండబోతోంది.
మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్ట్‌
వాట్సాప్‌ అకౌంట్‌ను  ఒక్క మొబైల్‌లోనే ఎందుకు వాడాలి... నా రెండు ఫోన్లలోనూ యాక్సెస్‌ చేయగలిగితే బాగుంటుంది కదా. మీకూ ఇదే ఆలోచన ఉందా? అయితే మీ మాట వాట్సాప్‌ విన్నదేమో. ఒకే నెంబరుతో రెండు మొబైల్స్‌లో వాట్సాప్‌ వాడేలా మల్టిపుల్‌ డివైజ్‌ సపోర్టును తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్‌ లాంటి యాప్‌లు ఈ తరహా ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఫోన్‌ లేకుండా వాట్సాప్‌ వెబ్‌
వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌/ల్యాప్‌టాప్‌లో వాడాలంటే... కచ్చితంగా మొబైల్‌ మీ దగ్గర ఉండాల్సిందే.. దానికి నెట్‌ కనెక్టివిటీ ఉండాల్సిందే. అయితే త్వరలో ఈ ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. మొబైల్‌ అందుబాటులో లేకపోయినా వాట్సాప్‌ వెబ్‌ వాడేలా మార్పులు చేస్తున్నారట. యూనివర్సల్‌ విండోస్‌ ప్లాట్‌ఫామ్‌ (యూడబ్ల్యూపీ) ద్వారా వాట్సాప్‌ వెబ్ పని చేసేలా మార్పులు చేస్తున్నారు. కాబట్టి మీ మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ అయినా వాట్సాప్‌ వాడేయొచ్చు.
మెసేజెస్‌ మాయమవుతాయ్‌
ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో సీక్రెట్‌ కన్వర్జేషన్‌ ఫీచర్‌ తెలుసు కదా. ఇప్పుడది వాట్సాప్‌లోకీ రాబోతోంది. అంటే మీరు ఎవరికైనా పంపిన మెసేజ్‌ వాళ్లు చూసిన తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతుంది. అయితే అది ఎంతసేపులో డిలీట్‌ అవ్వాలనేది మీ ఇష్టం. ఈ ఆప్షన్‌ త్వరలో వాట్సాప్‌లోనూ చూడొచ్చు. ఇప్పటికే వాట్సాప్‌ స్టేటస్‌లు 24 గంటల్లో డిలీట్‌ అయిపోతున్న విషయం తెలిసిందే.
నకిలీ వార్త అని అనుమానమా...
వాట్సాప్‌ ఎంతగా ఉపయోగకరంగా ఉంటుందో... నకిలీ వార్తల బెడదా అంతగానే ఉంది. ‘ఏదో ఫొటో పెట్టి... చూశారా ఫలానా దగ్గర అలా జరిగింది’ అంటూ ఓ మెసేజ్‌ పెట్టేస్తున్నారు. తీరా నమ్మితే ఆ ఫొటో/ విషయం తప్పు అని తెలుస్తుంది. దీని అరికట్టడానికి వాట్సాప్‌లో సెర్చ్‌ ఇమేజ్‌ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. మీకు వాట్సాప్‌లో వచ్చిన ఫొటో (అది ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అయి ఉంటే)కు చివర సెర్చ్‌ ఐకాన్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే గూగుల్‌ సెర్చ్‌లోకి ఆ ఇమేజ్‌ వెళ్లి క్రాస్‌ చెక్‌ చేస్తుంది. టెక్స్ట్‌ విషయంలోనూ ఇలా సెర్చ్‌ చేసుకోవచ్చు.
వాట్సాప్‌లోనే బ్రౌజర్‌
వాట్సాప్‌లో మనకూ రోజూ వార్తలు, వెబ్‌సైట్ల లింక్స్‌ వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్‌ చేస్తే వాట్సాప్‌ను వీడి.. వేరే బ్రౌజర్‌లో ఆ లింక్‌ ఓపెన్‌ అవుతుంది. త్వరలో అలా క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లోనే ఆ వెబ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది. దీని కోసం ఇన్‌ యాప్‌ బ్రౌజింగ్‌ ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. దీని వల్ల భద్రత లేని వెబ్‌సైట్లు/ వెబ్‌పేజీలను కూడా గుర్తించొచ్చు అని వాట్సాప్‌ భావిస్తోందట
------------------------------------------
వాట్సాప్‌లో ఈ ఫీచర్స్‌ గురించి తెలుసా..!
ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌.. మెసేజింగ్‌కు సరికొత్త అర్థాన్ని ఇస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి చేరువైంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తోంది. తాజాగా యూజర్స్‌ కోసం మరిన్ని మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే యూజర్లకు అందుబాటులోకి రాగా, మరికొన్ని బీటా దశలో ఉన్నాయి. మరి అవేంటో ఒక్కసారి చూసేద్దామా..
వేర్వేరు డివైజ్‌లలో ఒకే సారి
ఈ ఫీచర్‌ కోసం చాలా మంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో లాగిన్‌ అవ్వాలనుకునే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మొబైల్‌తో పాటు డెస్క్‌టాప్‌లో లాగిన్‌ అయ్యేందుకు మాత్రమే అవకాశం ఉంది. త్వరలో అందుబాటులోకి రానున్న మల్టీ డివైజ్ సపోర్ట్‌ ఫీచర్‌తో ఒకేసారి వేర్వేరు డివైజ్‌లలో లాగిన్ అవ్వచ్చు. అలా ఒకేసారి మెసేజ్‌లను వేర్వేరు డివైజ్‌లలో చూసుకోవడంతో పాటు, అంతకముందు మీరు మార్క్‌ చేసిన స్టార్ మెస్సేజ్‌లు, ఆర్కైవ్ చాట్స్‌ కూడా కొత్తగా లాగిన్ అయిన డివైజ్‌లో సింక్‌ అవుతాయి.
ఒకేసారి 50 మందితో..
గూగుల్ మీట్, జూమ్ యాప్‌ తరహాలో వాట్సాప్ కూడా ఒక వీడియో కాల్‌లో ఒకే సారి 50 మందితో మాట్లాడుకునే ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది. అలానే గ్రూప్‌ క్రియేట్ చేసి, ఇతరులను వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్‌ నుంచి ఇన్‌వైట్‌ చేసుకోవచ్చు.
కొత్త ఎమోజీలు, యానిమేటేడ్ స్టిక్కర్లు
ఎమోజీలతో తమ భావాలను వ్యక్తపరిచే వారి కోసం కొత్తగా 138 ఎమోజీలను వాట్సాప్‌ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఇవి వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ యాప్‌ ఉపయోగించే వారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిలో చెఫ్, ఫార్మర్‌, పెయింటర్‌తో ఇతర వృత్తులకు చెందిన ఎమోజీలనూ ఇస్తున్నారు.

No comments:

Post a Comment

Teacher Quick Links

Know Your Salary Know Your CFMS ID
e-Filing e-SR Login
ZPPF Slips CFMS
CSE Child Info Login
CCE Marks Entry eHazar Attendance Report
AP DIKSHA GPF Annual Account Statement
EHS Login APGLI
Pay Slips From CFMS CPS FUND