బడులు తెరిచేలోగా బదిలీలయ్యేనా?.. సిఎం వద్దే పెండింగులో ఫైలు !!
➤ బదిలీల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. మూడేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టలేదు. ఈ ఏడాదీ బదిలీలు చేపట్టకూడదని తొలుత ప్రభుత్వం భావించినా కరోనా వల్ల పాఠశాలలకు తాత్కాలిక విరామం రావడంతో పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు తెరిచేనాటికి ఉపాధ్యాయ బదిలీలు పూర్తికావాలని ముఖ్యమంత్రి ప్రకటించడంతో బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయుల్లో ఆనందం వ్యక్తమైంది.
➤సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బదిలీలకు, క్రమబద్ధీకరణకు సిద్ధంగా ఉండాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు కూడా జారీ చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ఎప్పుడైనా విడుదల కావొచ్చునని పేర్కొంది. బదిలీలకు సంబంధించిన ఫైలు సిఎం వద్దే సుమారు రెండు వారాల నుంచి పెండింగులో ఉండటంతో ఉపాధ్యాయుల్లో మరోసారి గందరగోళం నెలకొంది. బడులు తెరిచే నాటికి బదిలీలు పూర్తవుతాయా? అనే ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొంది. సిఎం ఆమోదం తెలిపిన వెంటనే బదిలీల ప్రక్రియ ప్రారంభించేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆఫ్‌లైన్ బదిలీలు ఉండే అవకాశం ఉండదు. ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. పాఠశాలలను సెప్టెంబరు 5న ప్రభుత్వం ప్రారంభిస్తే బదిలీలకు ఈ సమయం సరిపోదు. 1.80 లక్షల మంది ఉపాధ్యాయులు రాష్ట్రంలో ఉన్నారు. వీరిలో సుమారు లక్ష మంది బదిలీలు కోరుకునే అవకాశం ఉంది. చివరిసారిగా 2017లో జరిపిన బదిలీలకు రెండు నెలల సమయం పట్టింది. ప్రస్తుతం పాఠశాలల్లో నాడు-నేడు పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో బదిలీలు జరిగితే ఈ పనులకు ఆటంకాలు వస్తాయనే ఆలోచనతో ప్రభుత్వం పెండింగులో పెడుతున్నట్లు ఉపాధ్యాయులు భావిస్తున్నారు.

No comments:
Post a Comment