ఇక జనగణన వచ్చే ఏడాదిలోనే !
కొవిడ్ సంక్షోభం కారణంగా జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాదిలోనే జరగనుంది. ఈ ఏడాది ఇళ్లు, కట్టడాలు, కుటుంబ వివరాలతో ‘జాతీయ జనాభా రిజిస్టర్’(ఎన్‌పీఆర్) నమోదు పూర్తిచేయాల్సి ఉంది. కానీ, లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్‌పీఆర్ నమోదులో భాగంగా దేశంలోని అన్ని జననివాస ప్రాంతాలను గతేడాది(2019) డిసెంబరు 31 నాటికి జనాభా లెక్కల విభాగం అధికారికంగా గుర్తించింది. అప్పటికి ఏర్పడిన జిల్లాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాలనే పరిగణనలోకి తీసుకుంది. కానీ, కొవిడ్‌తో ఎన్‌పీఆర్ నమోదు ఆగిపోవడంతో జన నివాస ప్రాంతాల గుర్తింపు గడువును మరో ఏడాది వరకూ పొడిగించింది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్తగా గుర్తించిన జిల్లాలు, మండలాలు, గ్రామాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ ఏడాది ఇక ఎన్‌పీఆర్ నమోదు ఉండదని పరోక్షంగా చెప్పినట్లయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఎన్‌పీఆర్ నమోదు ఉండవచ్చని తాజా సమాచారం. ఇది పూర్తయిన తరవాత సమగ్రంగా వ్యక్తిగత జనగణన నెలరోజుల పాటు నిర్వహిస్తారు. ఏపీలో జిల్లాల విభజన జరగనున్నందున డిసెంబరు నాటికి కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పడితే వాటిని కూడా అధికారికంగా గుర్తించాలని జనాభా విభాగం నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరాలు అడిగింది.ఏపీ జనాభా లెక్కల విభాగం సంచాలకుల కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్‌లో తెలంగాణ కార్యాలయంలోనే ఉంది. దీనికి అనుబంధంగా విజయవాడలో ఆ రాష్ట్ర క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు తాజాగా కేంద్రం అనుమతించింది.ఈ నెలలోనే ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు

No comments:
Post a Comment